ఏపీలో మరో 108 అంబులెన్సు సర్వీసులు ప్రజలకు చేరువ కాబోతున్నాయి. క్షతగాత్రులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని త్వరగా ఆసుపత్రులకు తరలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికి రాష్ట్రంలో 439 అంబులెన్సులు ఉండగా, వాటికి మరో 266 వాహనాలు తోడు కానున్నాయి.
ప్రస్తుతం 1.11 లక్షల మందికి ఒక అంబులెన్సు ఉండగా కొత్తవి వస్తే 70వేల మందికి ఒకటి అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. దాదాపుగా ప్రతి మండలానికీ ఒక అంబులెన్సు అందుబాటులోకి రానుంది.