యోగాకు వయస్సు, రంగు, కులం, మతం తేడా లేదు. యోగాకు సంపన్నులు, పేదలు అనే తేడా లేదు. యోగా అందరిది. యోగా ఎల్లప్పుడూ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. మనమందరం యోగా సాధనను మరో స్థాయికి తీసుకెళ్లాలి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
మానవాళికి భారతదేశం అందించిన అపూర్వ కానుక. మానసిక, శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా అని మోదీ చెప్పారు. శుక్రవారం అయిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నేతృత్వం వహించారు.
దాదాపు 40వేల మంది యోగా అభ్యాసకులతో మోదీ ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. యోగా అంతర్జాతీయ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ ఉత్సాహంగా నిర్వహించారు.
Yoga for peace, harmony and progress! Watch #YogaDay2019 programme from Ranchi. https://t.co/nP8xHWMVYi
— Narendra Modi (@narendramodi) June 21, 2019