Home Latest News ఎమ్మెల్యే రోజాపై వాణీవిశ్వ‌నాథ్ పోటీ లేన‌ట్టే..! కార‌ణ‌మేంటో తెలుసా..?

ఎమ్మెల్యే రోజాపై వాణీవిశ్వ‌నాథ్ పోటీ లేన‌ట్టే..! కార‌ణ‌మేంటో తెలుసా..?

2019 ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత న‌గ‌రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాజీ ఎమ్మెల్యేగా రాజ‌కీయాలు చేయాల‌న్న‌ది టీడీపీ వ్యూహ‌మ‌ని, దీని కోసం ఇప్ప‌టికే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యేకంగా వ‌ర్క‌వుట్ చేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. రోజాను క‌చ్చితంగా ఓడించే స‌త్తా ఉన్న నేత‌కే టికెట్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న టీడీపీ అధిష్టానం.. ఆ క్ర‌మంలో బ‌ల‌మైన నేత‌ను వెతికే ప‌నిలో నిమ‌గ్న‌మై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికీ టికెట్‌ను కేటాయించ‌లేద‌ట‌.

అయితే, గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు ఉన్నంత కాలం ఎమ్మెల్యే రోజాకు ధీటుగా రాజ‌కీయం చేస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌రణం త‌రువాత గాలి భాను ప్ర‌కాశ్‌, గాలి జ‌గ‌దీశ్‌లు ముద్దు కృష్ణ‌మ‌నాయుడు వార‌స‌త్వం అందుకునేందుకు క‌త్తులు దూసినా చివ‌ర‌కు గాలి జ‌గ‌దీశ్ సైలెంట్ అయ్యారు. మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రి టికెట్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన అశోక్‌రాజు కూడా 2019 ఎన్నిక‌ల‌ టికెట్ రేస్‌లో ఉన్నారు.

అయితే చంద్ర‌బాబు మాత్రం రోజాను ఓడించే స‌మ‌ర్ధ‌త ఎవ‌రికి ఉంద‌న్న‌ది అంచనా వేయ‌డం మీదే దృష్టిపెట్టారు. ఈ కోణంలో స‌ర్వేల‌ను కూడా చేయిస్తున్నారు. గ‌తంలో వాణీ విశ్వ‌నాథ్‌ను కూడా తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు. సినీ గ్లామ‌ర్ ఉన్న రోజా మీద‌కు మ‌రో సినీ న‌టిని పెట్టాల‌న్న వ్యూహం వ‌ర్క‌వుట్ కాద‌న్న ఉద్దేశంతోనే వాణీ విశ్వనాథ్‌ను పోటీకి దింపాల‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబు విర‌మించుకున్నార‌ట‌. గాలి భాను, అశోక్‌రాజు ఇద్ద‌రిలో స‌మ‌ర్ధ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది తేల్చ‌డం మీద చంద్ర‌బాబు ఫోక‌స్ పెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad