ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినేట్లోని కొందరు మంత్రులు టీడీపీకి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరబోతున్నారంటూ పలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమవుతున్న కథనాలను మంత్రి అఖిల ప్రియ ఖండించారు. వైఎస్ జగన్ తన పార్టీకి లబ్ధి చేకూర్చుకునేందుకే పలు టీవీ ఛానెళ్లలో మంత్రులు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేయించుకుంటున్నారంటూ అఖిల ప్రియ మండిపడ్డారు.
కాగా, మంత్రి అఖిల ప్రియ ఇవాళ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు ఆశించి, దక్కని వారే పార్టీ మారుతున్నారని, అలాంటి వారిని నమ్మి టీడీపీ శ్రేణులు ఎవ్వరూ మోసపోవద్దని అఖిలప్రియ సూచించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించనున్నాయని అఖిల ప్రియ అన్నారు.