సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లోను సన్నబియ్యం మాత్రమే ఇస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పూర్తిగా సన్నబియ్యం సరఫరా చేయడానికి ఏడాదికి అదనంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
మొన్నటి వరకు తినడానికి పనికిరానటువంటి ధాన్యాన్ని ప్రజలకు సరఫరా చేయడం, ఆ బియ్యాన్నే మిల్లర్స్ కొనుగోలు చేసి పాలిష్పట్టి ఇవ్వడం ఇలా సైక్లింగ్ జరిగేదని, అటువంటి చర్యలను గత ప్రభుత్వం ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.
అలా పనికిరానటువంటి బియ్యాన్ని సరఫరా చేయకుండా, ప్రజలు ఇష్టపడే సన్న బియ్యాన్నే పంపిణీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ మేరకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.