Home Latest News టీడీపీకి మంత్రి అఖిల ప్రియ గుడ్ బై..?

టీడీపీకి మంత్రి అఖిల ప్రియ గుడ్ బై..?

ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ల్లో మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. అయితే, ఆళ్ల‌గ‌డ్డ‌లో క‌ర్నూలు జిల్లా ఎస్పీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 3వ తేదీన పోలీసుల బృందం కార్డన్ సెర్చ్ నిర్వ‌హించ‌గా, అందుకు ఆగ్ర‌హించిన మంత్రి అఖిల ప్రియ మా అనుచ‌రుల ఇళ్ల‌ల్లోనే త‌నిఖీలు నిర్వ‌హిస్తారా..? ఇప్పుడిప్పుడే ఫ్యాక్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న వారిని త‌నిఖీల పేరుతో వేధిస్తారా.?? అంటూ పోలీసుల‌పై ఆగ్ర‌హించిన సంగ‌తి తెలిసిందే.

అయితే, ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ అల‌క‌కు పోలీసుల కార్డ‌న్ సెర్చ్ కార‌ణం కాద‌ని, ఇంకా వేరే కారణాలు ఉన్నాయ‌ని తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. టీడీపీలో ప‌రిణామాల‌ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న అఖిల పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతోంది.

ఇదే సమ‌యంలో ప్ర‌భుత్వ పెద్దలు సంప్ర‌దింపులు, బుజ్జ‌గింపుల‌పైనా పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. ఆమె వ్య‌వ‌హారం పార్టీని ధిక్క‌రించేలా, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేసేలా ఉంద‌ని ప్ర‌భుత్వ ముఖ్యులు అంటున్నారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే మంత్రి అఖిల ప్రియ చిన్న విషయాన్ని పెద్ద‌ది చేశార‌ని, దీని కోసం ప‌దే ప‌దే చ‌ర్చ‌లు జ‌రిపే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు.

జిల్లా సీనియ‌ర్ మంత్రి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తిని ఒక‌సారి మాట్లాడాల‌ని అడిగినా ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ట‌. దీంతో ప్ర‌భుత్వం కూడా ఈ వ్య‌వ‌హారాన్ని వ‌దిలేసింది. ఆమె ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆందోళన చెందొద్ద‌ని భావిస్తోంది. ఈ వివాదంపై హోంమంత్రి చేసిన వ్యాఖ్య‌లే దీనికి ఉదాహ‌ర‌ణ‌గా పార్టీ నేత‌లు చెబుతున్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు జిల్లాకు వ‌స్తేనే స‌భ‌కు రాని అఖిల మ‌రి రేపు అమ‌రావ‌తి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న కేబినేట్ స‌మావేశానికి వ‌స్తారా..? రారా?? అన్న చ‌ర్చ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైంది.

పండుగ త‌రువాత కేబినేట్ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ లోపుగా క‌ర్నూలు వివాదానికి చెక్‌ప‌డుతుందా.?? మ‌ంత్రి మండ‌లి స‌మావేశానికైనా ఆమె వ‌స్తారా..? లేదా..?? అనేది త్కంఠ‌గా మారింది.

ప‌ట్టుద‌ల‌కు పోతే అంత తేలిగ్గా మెత్త‌ప‌డ‌ర‌ని పేరున్న అఖిల‌ప్రియ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోతే ఇక స‌ర్కార్‌కు దూర‌మైన‌ట్లేన‌ని ఆమె వ‌ర్గం నేత‌లు చెబుతున్నారు. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆమె అల‌క‌ల తీరుపై అసంతృప్తిగా ఉన్న ప‌రిస్థితుల్లో ఎంత మేర‌కు ఈ వివాదం ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad