Home Latest News సుప్రీంకోర్టులో మమతా గెలుపు.. ఇది నైతిక విజయం : దీదీ

సుప్రీంకోర్టులో మమతా గెలుపు.. ఇది నైతిక విజయం : దీదీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నాడు అనే సమయంలోనే సుప్రీంకోర్టులో దీదీకి అనుకూల తీర్పు రావడంతో బీజేపీ ఏతర పార్టీల్లో ఆనందం చిగురించింది.. “శారదా కుంభకోణం” దర్యాప్తు వ్యవహారంలో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ “రాజీవ్‌ కుమార్‌” ను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మమతాబెనర్జీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ తీర్పును నైతిక విజయంగా అభివర్ణించిన ఆమె, న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, సుప్రీం తీర్పును తాము అనుసరిస్తామని దీదీ ఆనందం వ్యక్తం చేశారు. “ఇది మా నైతిక విజయం. న్యాయవ్యవస్థతో పాటు ఇతర సంస్థల పట్ల మాకు అపార గౌరవం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును మేం అనుసరిస్తాం. CBI దర్యాప్తునకు అందుబాటులో లేనని రాజీవ్‌ కుమార్ ఎప్పుడూ చెప్పలేదు… కేసు విచారణకు అందుబాటులో ఉన్నానని పేర్కొంటూ రాజీవ్‌ కుమార్‌, CBIకి పలుమార్లు లేఖ రాశారు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు ? ఏకంగా ఆయన ఇంటికెళ్లి మరీ అరెస్టు చేయాలని చూశారు, ఇప్పుడు ఏమైంది ?” అంటూ మమతా సీబీఐ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉంటే మరోవైపు తాను చేస్తున్న ధర్నాను విరమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన మమతాబెనర్జీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, ఇతర ప్రతిపక్ష నేతలు నేడు కోల్‌కతాకు వస్తున్నారని, వారందరితో మాట్లాడిన తరువాతే ఈ ధర్నాపై ఓ నిర్ణయం తీసుకుంటామని దీదీ స్పష్టం చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad