ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. మేజర్లు అయిన యువతీయువకుడు ఏకాంతంగా గడపుతుండగా వాళ్ల కళ్లుకుట్టాయి. యువతి ఇంట్లో ఇద్దర్నీరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వాళ్లిద్దర్నీ స్థానికులు విచక్షణా రహితంగా కొట్టారు. అంతేకాదు, అందరి ముందు గుండు గీయించి తీవ్రంగా అవమాన పర్చారు.
ఈ దారుణ ఘటన మయూర్భంజ్, కరంజిలా బ్లాక్‌లోని మండువా గ్రామంలో జూన్ 22న చోటుచేసుకుంది. వారిద్దరికి గుండు కొట్టించడమే కాకుండా సెల్ఫోన్లలో ఫొటోలు తీశారు. అవి సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
మేజర్లైన యువతీ యువకులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన విషయం ఇక్కడ గమనార్హం.