Home General మూడు నెల‌లుగా గొంతులోనే జ‌ల‌గ‌..!

మూడు నెల‌లుగా గొంతులోనే జ‌ల‌గ‌..!

స‌గం న‌లుపు, మ‌రో స‌గం తెలుపు రంగుల‌ను క‌ల‌గ‌లుపుకుని.. శ‌రీరమంతా ప‌ట్టుకుంటే జారిపోయే జీడ ప‌దార్థాన్ని క‌లిగి, ఒళ్లు గ‌గుర్పొడిచే ఆకారం క‌లిగిన జ‌ల‌గ‌ను ఒక్క‌సారిగా ద‌గ్గ‌ర నుంచే చూస్తే ఒళ్లు త‌డుముకుంటూ ఆమ‌డ దూరం ప‌రుగెత్తుతాం. అలాంటిది ఓ మ‌హిళ జ‌ల‌గ‌ను త‌న నోట్లోనే ఉంచుకుంది. జ‌ల‌గ‌కు ఎంతో ఇష్ట‌మైన ర‌క్తాన్ని ధార‌పోసి మ‌రీ రెండు నెల‌ల‌పాటు పోషించింది.

బొద్దింక‌లంటేనే భ‌య‌ప‌డే లేడీస్ ఉన్న ఈ రోజుల్లో ఏకంగా జ‌ల‌గ‌నే నోట్లో ఉంచుకుందంటే ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డ్డ‌ట్టే. పాపం..! నోట్లో జ‌ల‌గ ఉంద‌ని, అది ర‌క్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంద‌ని విష‌యాలేమీ ఆమెకు తెలీదు. ఆమెకు త‌లెత్తిన అనారోగ్య స‌మస్య కార‌ణంగా వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళితే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

మొద‌ట‌గా టెస్టులు చేసిన వైద్యులు ఆమె గొంతులోని అన్న‌వాహిక‌లో ఏదో చిన్న గడ్డ ఉంద‌ని, దాని కార‌ణంగానే ఆమెకు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. కానీ, ఆ గ‌డ్డ‌ను ఎలా తొల‌గించాల‌న్న దానిపై ఆలోచిస్తున్న క్ర‌మంలో ఓ చిన్న కెమెరాను ఆ మ‌హిళ నోట్లో నుంచి అన్న వాహిక ద్వారాన్ని ప‌రీక్షించారు. కెమెరా చూపించిన దృశ్యాల‌ను చూసిన వైద్యులు సైతం షాక్‌కు గుర‌య్యారు. ఆమె అన్న వాహిక‌లో ఉన్న‌ది గ‌డ్డ కాద‌ని, జ‌ల‌గ అని గుర్తించారు.

చివ‌ర‌కు ఓ చిన్న వైద్య ప‌రిక‌రంతో రెండు నెల‌లుగా ఆ మ‌హిళ గొంతులో తిష్ట వేసిన జ‌ల‌గ‌ను బ‌య‌ట‌కు తీశారు. ఇంత‌కీ ఆ జ‌ల‌గ గొంతులోకి ఎలా వెళ్లింద‌న్న దానిపై ఆరా తీసిన వైద్యుల‌కు ఆ మ‌హిళ చెప్పిన స‌మాధానం ఇలా ఉంది.. తాను రెండు నెల‌ల క్రితం బీచ్‌లో స్నానం చేసేందుకు వెళ్లాల‌ని, బ‌హుశా అక్క‌డే జ‌ల‌గ నా నోట్లోకి వెళ్లి ఉండొచ్చ‌ని చెప్పింది. ఈ సంఘ‌ట‌న ద‌క్షిణ కొరియా హ‌గియాంగ్‌లో జ‌రిగింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad