హైదరాబాద్ రామాంతపూర్‌లో సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన చోటు చేసుకుంది. పదేళ్లు కూడా నిండని చిన్నారిపై ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ దారుణం రామాంతపూర్‌లోని టీవీ కాలనీలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు కూలిపనుల కోసం బయటకు వెళ్లారు. అంతలో స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉంటుందని గమనించిన కూలీపనులకు వెళ్లకుండా ఉన్న లక్ష్మణ్ అనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కామాంధుడికి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
జగద్గిరిగుట్టలోనూ ఈ తరహా సంఘటన ఒకటి జరిగింది. రిక్షాపుల్లర్స్ కాలనీకి చెందని ఒక జంట కూలీపనుల కోసం బయటకు వెళ్తూ ఐదేళ్లపాపను ఇంటివద్దే ఉంచారు. దీంతో పక్కింట్లో ఉండే 60 ఏళ్ల ఎల్లయ్య అనే వృద్ధుడు పాపపై కన్నేశాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడ్నుంచి పరారైపోయాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలా హైదరాబాద్ నగరంలో 24 గంటల వ్యవధిలో నాలుగు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నట్టు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.