Home Latest News ల‌గ‌డ‌పాటి ఫ‌లితాల్లో సీన్ రివ‌ర్స్‌.. అద్భుత విశ్లేష‌ణ‌..!

ల‌గ‌డ‌పాటి ఫ‌లితాల్లో సీన్ రివ‌ర్స్‌.. అద్భుత విశ్లేష‌ణ‌..!

ఏపీ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం తీవ్ర ఉత్కంఠ న‌డుమ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉన్న ఓట‌ర్ల తీర్పు ఎలా ఉండ‌బోతుంద‌న్న అంశం అభ్య‌ర్ధుల‌తోపాటు, ప్ర‌జ‌ల్లోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్ధుల్లో కొంద‌రు టెన్ష‌న్ త‌ట్టుకోలేక స‌ర్వేలు చేయించుకుంటుంటే.., మ‌రికొంద‌రు మాత్రం ఫారెన్ టూర్‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

అభ్య‌ర్ధుల తీరు ఇలా ఉంటే, పార్టీ అధినేతల ప‌రిస్థితి మ‌రోలా ఉంది. పార్టీ శ్రేణుల్లో ధీమాను నింపేందుకు గెలుపు మ‌న‌దేనంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చే ప‌నిలో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ఇటువంటి త‌రుణంలో వైసీపీలో మ‌రింత జోష్‌ను నింపేలా ఇటీవ‌ల కొన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల స‌ర్వేలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

ఇదే సంద‌ర్భంలో ఇప్పుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. పోలింగ్ ముగిసిన రోజున తిరుమ‌ల‌లో, ఆ త‌రువాత అమెరికాలో జ‌రిగిన ఎన్ఆర్ఐల స‌మావేశంలో టీడీపీ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్‌ను నింపేందుకు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాను నిత్యం బిజీగా ఉండే స‌ర్వేల‌పై మరింత దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది. ఆ సంద‌ర్భంలోనే ప్రీ పోల్‌, పోస్ట్ పోల్ త‌రువాత త‌న బృందాల‌తో ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు, అభ్య‌ర్ధుల మ‌ధ్య నువ్వా..? నేనా..? అన్న రీతిన పోటా పోటీ ఉండే స్థానాల‌పై ఒక‌టికి ప‌ది సార్లు రీ స‌ర్వే చేయిస్తున్నారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 40 స్థానాల్లో మాత్ర‌మే ట‌ఫ్ ఫైట్ న‌డుస్తుంద‌ని, ఆ 40 స్థానాల్లో ఏ పార్టీ అయితే అత్య‌ధిక మెజార్టీ సీట్ల‌ను గెలుపొందుతుందో ఆ పార్టీనే అధికారం చేప‌డుతుందంటూ ల‌గ‌డ‌పాటి చెప్ప‌డం విశేషం. మొన్న‌టి వ‌రకు ఏపీ ప్ర‌జ‌లు అభివృద్ధికే ప‌ట్టం క‌డ‌తార‌ని చెప్పిన ల‌గ‌డ‌పాటి, ఈ సారి ఆ 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు త‌ప్ప‌నిసరి అంటూ చెప్పడంతో రాజ‌కీయ టీడీపీ శ్రేణులు కాస్త ఆలోచ‌న‌లోప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad