Home Latest News జ‌గ‌న్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్ : చ‌ంద్ర‌బాబు

జ‌గ‌న్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్ : చ‌ంద్ర‌బాబు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్‌కు ఏపీపైన ద్వేషం, జ‌గ‌న్‌పై ప్రేమ ఉంద‌న్నారు. ఏపీలో తోలుబొమ్మ ప్ర‌భుత్వం ఉండాల‌ని, కేసీఆర్ కోరుకుంటున్నార‌న్నారు. ఏపీలో జ‌గ‌న్‌ను సామంత‌రాజుగా పెట్టాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తుంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌న్న కేసీఆర్ జ‌గ‌న్‌తో క‌లిసి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

కాగా, ఇవాళ ఏపీ టీడీపీ ముఖ్య నేత‌ల‌తో సీఎం చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాజ‌కీయ వైరుధ్యాలు ఉన్న కుటుంబాలు కూడా రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం టీడీపీలోకి వ‌స్తుంటే వైసీపీ మాత్రం కుల రాజ‌కీయాలు చేస్తుంద‌న్నారు. ప్ర‌శాంత్ కిశోర్ సూచ‌న‌ల‌తో, బీహార్‌ను మించిన కుల రాజ‌కీయాలు ఏపీలో చేసేందుకు జ‌గ‌న్ య‌త్నిస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఏపీ కేసీఆర్, ప్ర‌శాంత్ కిశోర్‌లాంటి వారి చేతుల్లోకి వెళ్లిపోతుంద‌న్నారు. ప్ర‌ధాని మోడీ పెద్ద న‌టుడ‌ని, అవ‌స‌ర‌మైతే ఏమైనా చేస్తార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad