Home Latest News కాసేప‌ట్లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కేసీఆర్..!

కాసేప‌ట్లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కేసీఆర్..!

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు కాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఓట్ ఆన్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఒక ముఖ్య‌మంత్రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇదే తొలిసారి. అయితే, ఇప్ప‌టికే బ‌డ్జెట్‌కు సంబంధించి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ స‌మావేశాల్లో క్వ‌శ్చ‌న్ అవ‌ర్ ఉండ‌దు. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన త‌రువాత అసెంబ్లీ శ‌నివారానికి వాయిదా ప‌డ‌నుంది. శ‌నివారం నాడు ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై అసెంబ్లీలో చ‌ర్చ‌ను ప్రారంబించ‌నున్నారు. ఆ త‌రువాత సోమ‌వారం నాడు ద్ర‌వ్య వినిమ‌య బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెల‌ప‌నుంది. పూర్తిస్థాయి బ‌డ్జెట్ మాదిరిగా ప్ర‌తి ప‌ద్దుపై చ‌ర్చ‌లుండ‌వ‌ని, తాత్కాలిక బ‌డ్జెట్ కావ‌డంతో సాధార‌ణ చర్చే ఉంటుంద‌ని అధికార‌ప‌క్షం చెబుతోంది. ఇక శాస‌న మండ‌లిలో మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. శాస‌న మండ‌లి ద్ర‌వ్య వినిమ‌య‌బిల్లుపై చ‌ర్చించి ఆమోద‌ముద్ర వేయ‌నుంది. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ పూర్త‌య్యే అవ‌కాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad