Home Latest News మండ‌వ ఇంటికి కేసీఆర్‌.. అస‌లు కార‌ణ‌మిదే..!

మండ‌వ ఇంటికి కేసీఆర్‌.. అస‌లు కార‌ణ‌మిదే..!

తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల నుంచి చాలా మంది నేత‌లు టీఆర్ఎస్‌లో చేరారు. ఆయా నేత‌ల ప్రాధాన్య‌త‌నుబ‌ట్టి కేటీఆర్‌, హ‌రీశ్‌రావు వంటి నేత‌లు మంత‌నాలు సాగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ వ‌చ్చారు. అయితే టీడీపీ సీనియర్ నేత మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు విష‌యంలో మాత్రం ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగంలోకి దిగ‌డంపై ఇప్పుడు సర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

జూబ్లీహిల్స్ ఎంపీ కాల‌నీలో ఉండే మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంటికి సీఎం కేసీఆర్ స్వ‌యంగా వెళ్లారు. కేసీఆర్ రాక ముందే మండ‌వ ఇంటికి ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వ‌స్తున్నార‌ని తెలుసుకున్న మండ‌వ కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు మెయిన్ గేటు వ‌ద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఎదురు చూశారు.

రాజ్య‌స‌భ ఎంపీ సంతోష్‌కుమార్‌తో క‌లిసి కేసీఆర్ మండ‌వ నివాసానికి వెళ్లారు. మండ‌వ వారిని సాద‌రంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. మండ‌వ కేసీఆర్ మ‌ధ్య దాదాపు గంట‌న్న‌ర‌పాటు చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాల‌ని మండ‌వను కేసీఆర్ ఆహ్వానించారు.

స్వ‌యంగా సీఎం కేసీఆరే వెళ్లి ఆయ‌న్ను ఆహ్వానించ‌డంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుకు కేసీఆర్ అంత ప్రాధాన్య‌త‌ను ఇచ్చేందుకు లోక్‌స‌భ ఎన్నిక‌లే కార‌ణంగా క‌నిపిస్తున్నా, దాని వెనుక సామాజిక కోణం కూడా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

టీడీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసి నిజామాబాద్ జిల్లాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మండ‌వ‌కు అక్క‌డ బ‌ల‌మైన వ‌ర్గ‌మే ఉంది. క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గంలో బ‌లమైన నేత‌గా మండ‌వ‌కు గుర్తింపు ఉంది. క‌మ్మ‌నేత‌గా ఉన్న మండ‌వ‌ను ఎమ్మెల్సీని చూసి కీల‌క‌మైన ప‌ద‌వి ఇస్తే కుల స‌మీక‌ర‌ణాల‌ను బ్యాలెన్స్ చేసిన‌ట్ట‌వుతుంద‌న్న ఉద్దేశంతోనే మండ‌వ విష‌యంలో కేసీఆర్ అంత ప్రాధాన్య‌త‌ను ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read Also: జ‌ర్న‌లిస్టు చెప్పులు మోసిన ప్రియాంక గాంధీ..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad