తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. త్వరలోనే తన కేబినెట్లో మార్పులు, చేర్పులు, చేరికలు చేయబోతున్నారు. జులై మొదటి వారంలో ఆరు కీలక మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు.
కేటీఆర్కు గతంలో నిర్వహించిన ఐటీ కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, మాజీ మంత్రి హరీష్ రావుకు గతంలో ఆయన నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖకు బదులుగా విద్యా శాఖ కేటాయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీనుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం.