మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిల ఇవాళ మీడియాతో ముచ్చటించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 2014లో ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, వైఎస్ జగన్ మాత్రం కచ్చితంగా చేయగలిగిన అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు.
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఎన్నికల్లో అందరి దృష్టి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది.. దానిపై మీ అభిప్రాయం అడిగిన మీడియా ప్రతినిధికి వైఎస్ షర్మిల సమాధానం చెప్తూ అక్కడ పప్పుగారు ఉన్నారు కదండీ..! ఆయన ఓడిపోతే అంతకు మించిన సంతోషం ఏపీ ప్రజలకు ఇంకేముంటుంది… అంటూ కామెంట్ చేశారు. అయినా ఈ ఎన్నికల్లో పప్పు లాంటి కమెడియన్ లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది అంటూ ఎద్దేవ చేశారు.