Home General జ‌య‌రామ్ హ‌త్య : ఆ 31 గంట‌లు ఏం జ‌రిగిందంటే..?

జ‌య‌రామ్ హ‌త్య : ఆ 31 గంట‌లు ఏం జ‌రిగిందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన పారిశ్రామిక‌వేత్త జ‌య‌రామ్ హ‌త్య కేసులో మిస్ట‌రీ కొన‌సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్ర‌ధాన నిందితుడు రాకేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన‌ప్ప‌టికీ ఇంకా మ‌రో ఐదు మందికి జ‌య‌రామ్ హ‌త్య కేసులో ప్రమేయం ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. రాకేశ్‌రెడ్డితోపాటు జ‌య‌రామ్ మేన‌కోడ‌లు శిఖా చౌద‌రిని, మ‌రో న‌లుగురుని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు విచారిస్తున్నారు.

అయితే, జ‌య‌రామ్ హ‌త్య కేసులో ఆ 31 గంట‌లు చాలా కీల‌కంగా మారాయి. ఈ నెల జ‌న‌వ‌రి 30వ తేదీ మ‌ధ్యాహ్నం జ‌య‌రామ్ త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 21 గంట‌ల త‌రువాత జ‌య‌రామ్ కృష్ణా జిల్లా నందిగామ‌లో బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆ 31 గంట‌ల్లో ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ద‌ర్యాప్తు చురుగ్గా జ‌రుగుతోంది.

మ‌రో ప‌క్క జ‌య‌రామ్ సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా చాలా ఆధారాలు ల‌భించాయి. జ‌యరామ్ హైద‌రాబాద్‌లోని ద‌స్‌ప‌ల్లా హోట‌ల్లో చాలా సేపు ఓ గ‌దిలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. త‌రువాత జూబ్లీ హిల్స్‌లోని వివాహ భోజ‌నంబు హోట‌ల్‌కు వెళ్లిన‌ట్టు చెప్తున్నారు.

రాకేశ్‌రెడ్డి, శిఖా చౌద‌రికి చాలా కాలంగా స‌న్నిహిత సంబంధం ఉంద‌ని, పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌న‌కు వ‌చ్చారు. రాకేశ్‌రెడ్డి ఆయ‌న స్నేహితుడు శ్రీ‌కాంత్‌రెడ్డి, శిఖా చౌద‌రితోపాటు ఆమె సోద‌రిని కూడా హ‌త్య‌కు సంబంధించి ప్ర‌శ్నిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad