Home General జ‌య‌రామ్ హ‌త్య‌పై శిఖాచౌద‌రి వివ‌ర‌ణ‌..!

జ‌య‌రామ్ హ‌త్య‌పై శిఖాచౌద‌రి వివ‌ర‌ణ‌..!

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జ‌య‌రామ్ హ‌త్య‌కేసుతో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని, త‌న‌తో ఎక్కువ‌గా కంపెనీ విష‌యాలే మాట్లాడేవార‌ని ఆయ‌న మేన కోడ‌లు శిఖా చౌద‌రి చెప్పారు. కాగా, శిఖా చౌద‌రి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ జ‌య‌రామ్‌కు కానీ, ఆయ‌న కంపెనీల‌కు కానీ ఎటువంటి సంబంధం లేకుండా తాను సొంతంగా ఒక ప్రాజెక్టును టేకోవ‌ర్ చేస్తున్నట్టు తెలిపింది.

నేను చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టులు, క్ల‌యింట్ విష‌యంలో జ‌య‌రామ్ నాకు హెల్ప్ చేశాడు. ప్రాజెక్టుకు సంబంధించి నెగిటివ్స్ ఏంటి..? పాజుబులిటీస్ ఏంటి..? అన్న విష‌యాల‌ను స్ట‌డీ చేసి నాకు స‌ల‌హాలు ఇచ్చేవాడు. యూ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అంటూ జ‌య‌రామ్ త‌న‌కు వాట్స‌ప్ మెసేజ్‌లు పెట్టేవాడని శిఖా చౌద‌రి తెలిపింది.

అటువంటిది, జ‌య‌రామ్ హ‌త్య‌కు, త‌న‌కు సంబంధం ఉందంటూ కొన్ని ఛానెల్స్ ప్ర‌సారం చేశాయ‌ని, ఆ వార్త‌ల‌ను త‌న‌ను ఎంత‌గానో బాధించాయ‌న్నారు. జ‌య‌రామ్ హ‌త్య ఉదంతం వెలుగులోకి వ‌చ్చాక చాలా మంది వాళ్ల ఇంటికి వ‌చ్చారు. నేను కూడా వెళ్లాను. ఆ స‌మ‌యంలో జ‌య‌రామ్ ఇంటి నుంచి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ల‌లేద‌ని చెప్పింది.

జ‌య‌రామ్ హ‌త్య‌కు గురి కాక ముందు రూ.4 కోట్లు అప్పు చేశాన‌ని, ప్ర‌స్తుతం కోటి రూపాయ‌లు అర్జెంట్‌గా కావాల‌ని, అన్ని విష‌యాలను త‌రువాత నీకు వివ‌రిస్తాన‌ని ఫోన్‌చేసి చెప్పారు. అలా చెప్పిన అంత‌లోనే హ‌త్య జ‌రిగింద‌ని శిఖా చౌద‌రి తెలిపింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad