Home రాజకీయాలు ఒకప్పుడు వైఎస్ఆర్...ఇప్పుడు వైజేఆర్

ఒకప్పుడు వైఎస్ఆర్…ఇప్పుడు వైజేఆర్

తండ్రి బాటలో  తనయుడు.. ఒకప్పుడు వైస్ రాజశేఖర్ పాదయాత్రతోనే పదవిని చేజిక్కుంచుకున్నాడు. ఇపుడు జగన్ కూడా బ్రహ్మాస్త్రాన్ని పట్టుకున్నాడు. జగన్ తండ్రి  బాటలో  నడుస్తూ ప్రతి గడప గడప  తిరిగి కష్టాలను కంటి తో చూశానని,  ప్రతి  గుండె చప్పుడు  విన్నాను అని, చంద్రబాబు పాలన భయంకరంగా ఉందని 3648 కిలోమీటర్స్  పాదయాత్రలో ప్రజలను పక్కనుండి చూశానని, ఇడుపుల పాయలో మొదలైన  తన పాదయాత్ర 14 నెలలు పూర్తి చేసుకొని ప్రజల ఆదరణ ఇంతలా ఉంటుందని ఊహించలేదని ప్రజా సంకల్ప పాద యాత్ర శ్రీకాకుళం  ఇచ్ఛాపురంలో ముగిస్తూ, నా అడుగులో అడుగు వేసి నను నడిపించిన ప్రజలకు,  నా  పాదయాత్ర విజయానికి  వెన్నంటి నాతో  ఉన్న   మీ అందరికి     శిరస్సువచ్చినమస్కరిస్తున్నాను అని, ప్రజలు తనను  నడిపించారంటూ జగన్ చెప్పాడు. అంతేకాకుండా ఈ  మహా పాద యాత్ర లో ప్రతిచోటా  ప్రజల బాధల్ని పంచుకోవడం తో పాటు, చంద్రబాబు పాలనలో ఎంత అసంతృప్తి చెందారో స్వయంగా తెలుసుకున్నాను అని  2 గంటలపాటు చేసిన భారి మహాసభ  ప్రసంగం లో  గంటన్నరపాటు  చంద్రబాబు నాయుడి పరిపాలనను బయట వేసాడు జగన్.

ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్న జగన్ :
తాను  అధికారం లోకి వస్తే నవరత్నాల పధకాలను ప్రతి పేదవానికి అందే విధంగా చేస్తామన్నారు. పగటి పూట రైతులకు 9 గంటలు విద్యుత్ను అందిస్తామని తెలిపారు.రైతులకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామన్నారు. రైతులకు ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయిస్తుందన్నారు. ప్రమాదవ శాత్తు రైతు చనిపోతే వైఎస్ఆర్ భీమా కింద రూ.5లక్షలు చెల్లిస్తానని చెప్పారు.ఇలా రైతులకు వరాల జల్లు కురిపించాడు. ఇంకా 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చుతామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తానని .  ఏడు నియోజక వర్గాల పరిధిలో  కలెక్టర్లు మంచి పాలనను అందిస్తారన్నారు.నిరుద్యోగులకు  తప్పక  న్యాయం  చేస్తామని   ముందుగానే  ప్రజలకు మాట నిచ్చాడు  ప్రతిపక్ష నేత జగన్ .

చంద్రబాబు ఫై మండిపడ్డ జగన్:
2గంటల పాటు సాగిన ఈ  ముగింపు సభలో  చంద్రబాబు పాలనను ప్రజలకు లోకి మరింతగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. రైతులంటే చిన్నచూపు అని , జాతీయ రాజకీయాలు అని  నాటకమాడుతున్నాడని ,  సీమకు నీళ్లను అందించడం లో కూడా విఫలమయ్యాడని  ఆరోపించారు జగన్. 2014 లో గెలవటానికి చేసిన నాటకమని  మేనిఫెస్టో లో చెప్పిన 650  హామీలు   ఎక్కడ పూర్తి చేసాడు అంటూ మండిపడ్డాడు. బాబువస్తే జాబు వస్తుందని చెప్పి నమ్మిన ప్రజలకు  ఉన్న ఉద్యోగాలు ఎలా తీసేసాడు అంటూ,  నమ్మము బాబు నమ్మము అని ప్రజలు అంటున్నారంటూ విమర్శలు కురిపించాడు జగన్.

ఈసారి  ఎలక్షన్ లో ప్రజలు తప్పకుండ తనని గుర్తిస్తారని చంద్రబాబు ని చిత్తుగా ఓడిస్తామని పాదయాత్రలో ప్రజల మాటలో  అర్థమైనదంటూ ప్రజలకు తన సేవ ను ఎలా అందిoచాలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకొని ఇచ్చాపురం సభలోప్రజల ముందు పెట్టాడు . నిరుద్యోగులకు, రైతులకు, ఫించన్ దారులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానని బహిరంగ ప్రకటన చేసాడు.

ఇంకోపక్కన చూస్తే పాదయాత్ర సమయంలో బాబు బస్సు యాత్ర చేసాడు. ఇపుడు జన్మభూమి- మా ఊరు అంటూ కార్యక్రమం కి వెళ్లినపుడు బీజేపీ నేతలు  అడ్డుకున్నారు. ఆ సమయంలో మోడీ కి సిగ్గులేదని రాష్ట్ర ద్రోహం చేసాడు అని వాఖ్యానించాడు. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని కేంద్రంతోనే పెట్టుకున్నాడు.

మరో పక్క చూస్తే  కేంద్రం నుండి చంద్రబాబు ఫై నరేంద్రమోడీ మండి పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఆదివారం నర్సారావు పేట లోకసభ నియోజకవర్గంలో బూత్ స్థాయి కార్యకర్తలతో  మీడియా కాన్ఫెరెన్స్ నిర్వహించగా చంద్రబాబు ఫై తీవ్ర విమర్శలు మోడీ కురిపించాడు.  చంద్రబాబు పదవిని కాపాడుకోవడానికీ ప్రయత్నిస్తున్నాడు అన్నట్లు చెప్పారు. .

మరో వైపుగా జనం లోకి దూసుకెళ్తున్న జన సేన పార్టీ. పవన్ కల్యాణ్ రూటే సపరేట్ కదా 175 స్థానాల్లో తప్పక పోటీ చేస్తామని పవన్ ప్రకటన వెల్లడించారు.

చివరకు CM  సీట్ ఎవరికి దక్కనుందో :
AP  లో ఈ సారి  ఎన్నికలు వేడిగా సాగనున్నాయని అర్ధమవుతుంది. అటు కేంద్రంతో  పెట్టుకుంటూ   ఇటు ప్రజల్లో నమ్మకం పోగుట్టుకున్న బాబు నిజంగానే బలహీనమవుతున్నాడా, ఈ సారి చంద్రబాబు చిత్తుగా ఓడిపోతాడా లేక జగన్ ఎత్తుకుకి ఫై ఎత్తువేసుకుంటాడా బాబు లేక జగన్ పాదయాత్ర పదవికి సంకేతమా, జనాలు జగన్ కి జేజేలు పలుకుతారా. లేక  ఈ సారికి ప్రజలు పవన్ కి పట్టం కడతారా. సీఎం సీట్ ఎవరి కి దక్కుతుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad