ఓటర్లను బోల్తా కొట్టించేందుకు కడప జిల్లాలో YCP నేతలు తప్పుడు ప్రయత్నిస్తున్నారు అంటూ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నమూనా బ్యాలెట్ ను రూపొందించి YCP కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అలా ఆరోపణలు చేశాడో లేదో.. ఇలా ఆయన ఇంటిపై IT దాడులు జరుగుతున్నాయి. దాంతో TDP శ్రేణులకు అనేక అనుమానాలు వస్తున్నాయి.
తమిళనాడు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ TDP నేతలపై కూడా IT దాడులు చేసి ఎలాగైనా మా పార్టీని దెబ్బకొట్టాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఇందులో బాగంగానే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై దాడులు నిర్వహించారని.. మరికొన్ని గంటల్లో ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ళల్లో IT సోదాలు జరగనున్నాయని సంచారం. IT అధికారులు ఇప్పటికే పుట్టా సుధాకర్ ఇంట్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఎలాంటి నగదు దొరకలేదని IT అధికారులు అక్కడినుండి వెళ్లిపోవడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.