Home General పాక్ అభినంద‌న్‌ను భార‌త్‌కు అప్ప‌గించే ప్లేస్ అదేనా..?

పాక్ అభినంద‌న్‌ను భార‌త్‌కు అప్ప‌గించే ప్లేస్ అదేనా..?

ఇండియ‌న్ హీరో అభినంద‌న్ వ‌స్తున్నాడు. ఈ రోజు పాక్ ఆర్మీ అభినంద‌న్‌ను భార‌త్‌కు అప్ప‌గించ‌బోతోంది. అత‌న్ని ఆధీనంలోకి తీసుకుని 48 గంట‌లు గ‌డ‌వ‌క ముందే విడిచిపెట్టేందుకు పాక్ ఆర్మీ నిర్ణయించింది. ఈ మేర‌కు పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ కూడా అభినందన్‌ను భార‌త్‌కు అప్ప‌గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. సాక్ష్యాత్తు పార్ల‌మెంట్‌లోనే ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మనార్హం.ఇండియ‌న్ హీరోను విడుద‌ల చేసి శాంతి సందేశం పంపుతాన‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నాడు.

అయితే, అభినంద‌న్‌ను ఎప్పుడు..? ఎక్క‌డ..? భార‌త్‌కు అప్ప‌గిస్తారో ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ చెప్ప‌లేదు. అత‌డిని వాఘా బోర్డ‌ర్ ద‌గ్గ‌ర మ‌న సైనికుల‌కు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో కార్గిల్ యుద్ధ ఖైదీని ఇలానే అప్ప‌గించారు. అభినంద‌న్‌ను ఈ రోజు సాయంత్రం భారత ద‌ళాల‌కు అప్ప‌గిస్తారు. అయితే, పాకిస్తాన్ ఆర్మీ అధికారులే ఈ ప‌ని చేస్తారా..? లేక ఇంట‌ర్నేష‌న‌ల్ రెడ్‌క్రాస్ సొసైటీకి ఈ ప‌నిని అప్ప‌గిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. దీనిపై పాకిస్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad