Home General ఐపీఎల్ 2019 : చెన్నైకు చుక్క‌లు చూపించిన హైద‌రాబాద్ బౌల‌ర్లు..!

ఐపీఎల్ 2019 : చెన్నైకు చుక్క‌లు చూపించిన హైద‌రాబాద్ బౌల‌ర్లు..!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస ఓట‌ముల నుంచి తేరుకుంది. చాలా రోజుల త‌రువాత అద్భుత‌మైన ఆట తీరుతో త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించింది. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో త‌న ప్ర‌త్య‌ర్ధి చెన్నైను చిత్తు చేసింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

టాస్‌గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట్స్‌మెన్స్‌కు హైద‌రాబాద్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. ఓపెన‌ర్లు వాట్స‌న్‌, డూప్లెసిస్‌లు ధాటిగా ఆడే ప్ర‌య‌త్నం చేసినా వారి దూకుడుకు బౌల‌ర్లు బ్రేక్‌లు వేశారు. ఆ త‌రువాత చెన్నై బ్యాట్స్‌మెన్స్ ఫెవిలియ‌న్‌కు క్యూక‌ట్టారు. ఓవైపు వికెట్ల‌ను ప‌డ‌గొడుతూనే హైద‌రాబాద్ బౌల‌ర్లు ప‌రుగులు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. దీంతో 5 వికెట్లు కోల్పోయిన చెన్నై 132 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్‌కు ఓపెన‌ర్లు వార్న‌ర్, బెయిర్‌స్టో రాణించారు. అర్ధ సెంచ‌రీల‌తో గెలుపులో కీల‌క‌పాత్ర పోషించారు. ఎక్క‌డా ఛాన్స్ ఇవ్వ‌లేదు. సింగిల్ష్ తీస్తూనే బౌండ‌రీల‌ను దాటించారు. ఓపెన‌ర్లు రాణించ‌డంతో గెలుపు ఈజీ అయింది. కేవ‌లం 16.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయిన హైద‌రాబాద్ ల‌క్ష్యాన్ని చేదించింది. వ‌రుస ఓట‌ముల‌తో డీలాప‌డిపోయిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఈ విక్ట‌రీ మాంచి కిక్ ఇచ్చేదేన‌ని క్రికెట్ ఎన‌లిస్టులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad