Home General ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులపై కాల్పులు.. 10 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులపై కాల్పులు.. 10 మంది మావోల మృతి

సైనికులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దేశంపై మావోయిస్టుల దాడులు ఆగడం లేదు. కొన్ని గంటల క్రితమే ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతం కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది. అబూజ్‌ మడ్‌ ప్రాంతంలోని ఇంద్రావతి నది సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి.

DRG, STF సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌ ను బీజాపూర్‌ SP “మోహిత్‌ గార్గ్‌” ధ్రువీకరించిన ఆయన, ఘటనాస్థలం నుంచి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భైరాంగఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందింది.

దాంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్‌మడ్‌‌ ప్రాంతంలో DRG, STF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మన జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో మన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో మావోయిస్టు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad