Home General ఢిల్లీపై హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం

ఢిల్లీపై హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ గ‌త ఐపీఎల్‌లోని జోరును ఈ సీజ‌న్‌లోనూ కంటిన్యూ చేస్తోంది. గురువారం ఢిల్లీలో జ‌రిగిన మ్యాచ్‌లో క్యాపిట‌ల్స్‌పై ఐదు వికెట్‌ల తేడాతో విజ‌యం సాధించి పాయింట్‌ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇక ఇవాళ జ‌రిగే మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్, కోల్‌క‌తా త‌ల‌ప‌డ‌నున్నాయి.

ముందుగా, టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఎనిమిది వికెట్‌లు కోల్పోయి 129 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాష్ అయ్య‌ర్ మాత్ర‌మే రాణించాడు. 43 ప‌రుగుల‌తో ఒంట‌రి పోరాటం చేశాడు. చివ‌ర్లో అక్ష‌ర్‌ప‌టేల్ మెరుపులు మెరిపించ‌డంతో ఢిల్లీ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది.

ఇక ఢిల్లీలో మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రూ పెద్ద‌గా ఆడ‌లేదు. కోల్‌క‌తాపై మెరుపులు మెరిపించిన పృద్వీషా 11 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. శిఖ‌ర్ దావన్ 12, రిషబ్ పంత్ 5 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. ఇక హైద‌రాబాద్ బౌల‌ర్‌ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ న‌బీ సిధార్ రెండేసి వికెట్‌లు తీశారు. ర‌షీద్ ఖాన్, సందీప్ శ‌ర్మ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

అయితే, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సీజ‌న్‌లో మూడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఢిల్లీలో జ‌రిగిన మ్యాచ్‌లో పిచ్ నెమ్మ‌దిగా ఉండ‌టంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేదించేందుకు హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్స్ మొద‌ట్లో కాస్త ఇబ్బంది ప‌డ్డారు. 130 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్‌కు ఓపెన‌ర్‌లు బెయిర్ స్టో, డేవిడ్ వార్న‌ర్ మంచి శుభారంబాన్ని ఇచ్చారు.

వారిద్ద‌రూ క్రీజ్‌లో ఉన్న‌ప్పుడు ల‌క్ష్యం చిన్న‌దిగా క‌నిపించినా ఓపెన‌ర్లు ఔట‌య్యాక వ‌చ్చిన బ్యాట్స్‌మెన్స్ చేజింగ్‌లో ఇబ్బంది ప‌డ్డారు. విజ‌య‌శంక‌ర్‌, మ‌నీష్ పాండేలు సింగిల్స్ తీస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. మ‌ధ్య‌లో వీరిద్ద‌రూ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన యూస‌ఫ్ ప‌ఠాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ విజ‌యాన్ని అందించారు. ఈ విక్ట‌రీతో పాయింట్ల ప‌ట్టిక‌లో హైద‌రాబాద్ అగ్ర స్థానానికి చేరుకుంది.

ఒక ద‌శ‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఆరు ఓవ‌ర్లకే 60 ప‌రుగులు చేసి మాంచి ఊపుమీద ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే, ఏడో ఓవ‌ర్‌లో బెయిర్ స్టో ఔట‌వ్వ‌డం, ఆ త‌రువాతి ఓవ‌ర్‌లోనే వార్న‌ర్ వికెట్ కూడా కోల్పోవ‌డంతో స్కోరు వేగం త‌గ్గింది. బెయిర్ స్టో 28 బంతుల్లోనే 48 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్‌ల‌లో ఎవ‌రూ కూడా చెప్పుకోద‌గ్గ స్కోర్ చేయ‌లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad