Home General భార్య, బిడ్డను చంపి పెట్రోలు పోసి కాల్చేసిన భర్త

భార్య, బిడ్డను చంపి పెట్రోలు పోసి కాల్చేసిన భర్త

మేడ్చెల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడుపున పుట్టిన బిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసి, అనంతరం పంట పొలాల్లో పెట్రోల్ పోసి తగులబెట్టాడు భర్త. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కొండాపూర్ గ్రామంలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తట్టుకోలేక తనకు దూరంగా ఉన్నా భార్యను మాట్లాడటానికి పిలిచి భార్యను, కన్న కుమారున్ని చంపేశాడు భర్త.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …

మృతురాలు పేరు శుశ్రుత వరంగల్ జిల్లా బొల్లికుంటకు చెందిన దళిత యువతీ, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేశ్‌, హైదరాబాద్‌లో బీఫార్మసీ చేస్తున్నప్పుడు శుశ్రుత కు రమేశ్‌తో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మరి వీరిద్దరూ సహజీవనం చేసే వరకు దారి తీసింది. ఈ క్రమంలో శుశ్రుత గర్భం దాల్చింది.  అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.

కానీ వీరి పెళ్లి కి పెద్దలు ఒప్పుకోకపోవడం తో ఈ ఇద్దరు రెండేళ్ల క్రితం ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు.  పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో నే ఉంటున్నారు. వీరి కాపురం ఏ గొడవలు లేకుండా సజావుగా సాగుతున్న నేపథ్యంలో రమేష్ తల్లిదండ్రులు వీరి జీవితంలో కి ప్రవేశిచటం తో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 8 నెలల క్రితం భార్య భర్తల మధ్య గొడవ కారణంగా శుశ్రుత పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికే గర్భిణితో ఉన్న శుశ్రుత 2 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది.

రమేష్ తో గొడవ పెట్టుకొని వెళ్లిపోయి తల్లిదండ్రుల దగ్గర ఉన్న శుశ్రుతకు 09-02-2019 తేదీన ఫోన్ చేసి తనతో మాట్లాడాలని  ఉందని కబురు పంపాడు. దింతో శుశ్రుత గొడవ పడి వెళ్ళిపోయిన భర్త రమ్మని కబురు పంపగానే ఏమి ఆలోచించకుండా తన మీద ఉన్నా ప్రేమతో రెండున్నర నెలల బాబును తీసుకొని తెలిసిన బంధువుతో భర్త వద్దకు వెళ్ళింది. ఉప్పల్ డిపో కు చేరుకున్న శుశ్రుతను కలిసిన రమేష్ భార్యతో మాట్లాడాలని  శుశ్రుత తో వచ్చిన బంధువును ఉప్పల్ డిపో వద్ద వదిలేసి శుశ్రుత ను రమేష్ బైక్‌పై తీసుకెళ్లాడు.

ఘట్‌కేసర్ దగ్గరలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి భార్యతో రమేష్ గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలోనే భార్యను కన్నా కొడుకును కూడా అతి దారుణంగా హత్య చేసి ఇద్దరి మృత దేహాలను పెట్రోల్ పోసి కాల్చేసాడు. అనంతరం పాలకుర్తి పోలీసుల స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అయితే స్టేషన్ లో రమేష్ పోలీసుల కు చెప్పిన వివరాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

శనివారం రోజున రాత్రి రమేష్ ,శుశ్రుత గొడవ పడినట్టు ఈ గొడవలో శుశ్రుత చనిపోతానట్టు నిద్రమాత్రలు మింగి బాబుకు కూడా ఒకటి వేసిందని, అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ అదే రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై కొండాపూర్ తీసుకెళ్లి ఇద్దరి గొంతు నులిమి చంపేశానని, అనంతరం పెట్రోలు పోసి తగలబెట్టానని చెప్పాడు. రమేష్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులకు అనుమానం వచ్చిన పాలకుర్తి పోలీసులు ఘట్‌‌కేసర్ పోలీసుల కు సమాచారం ఇచ్చారు. దింతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు పరిశీలించగా బూడిద, కాలిన ఎముకలు కనిపించాయి. దింతో రమేష్ మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కానీ శుశ్రుత తల్లిదండ్రులు వారి బంధువులు మాత్రం ఇది రమేష్ కుటుంబ సభ్యులు చేసినారని, పరువు హత్యేనని చెప్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad