Home General నగరంలో దారుణ హత్యలు.. ఒకరిని రాడ్ తో, మరొకరిని బకెట్ లో ముంచి..!

నగరంలో దారుణ హత్యలు.. ఒకరిని రాడ్ తో, మరొకరిని బకెట్ లో ముంచి..!

హైదరాబాద్ లో దారుణమైన ఘాతుకం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కసాయివాడై భార్యను కడతేర్చాడు… భార్యతో పాటు లోక జ్ఞానం కూడా తెలియని నాలుగేళ్ల కుమారుడుని పొట్టనపెట్టుకున్నాడు. ఇంట్లోనే దురాగతానికి పాల్పడి.. పరారయ్యాడు. తల్లికుమారుల మృతదేహాలను గుర్తించిన నిందితుని తోడల్లుడు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే ..

ఉత్తరప్రదేశ్‌లోని దేవారియాకు సంబందించిన రాజేష్‌ అతని భార్య ఊర్మిళ , కొడుకు గత పదిహేను రోజుల క్రితం నగరానికి బ్రతకు దెరువు కై వచ్చారు. సనత్‌నగర్‌లో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరి ఇంటికి సమీపాన ఊర్మిళ సోదరి, భర్త నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహన సమయాన ఊర్మిళ సోదరి భర్త వారి ఇంటికి వచ్చాడు. తాళం వేసి ఉన్న కారణముగా రాజేష్ కి కాల్ చేయగా  అతను రెస్పాన్స్ కాలేదు. దాదాపుగా రెండు గంటలు వేచి చూశాడు. దీంతో అనుమానం కలిగిన నిందితుని తోడల్లుడు స్థానికుల సహాయంతో డోర్ పగల కొట్టి చూడగా.. తల్లి కుమారుల మృత దేహాలు చూసి నివ్వరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిగా ఘటన స్థలానికి చేరుకున్నారు.

స్థానికుల, బంధువుల సమచారం మేరకు గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో.. తరుచూ గొడవ పడుతుండటం జరిగిందని, పెద్దలు ఎన్నో సార్లు రాజీ కుదర్చగా.. చివరకు ఊర్మిళ సోదరి సలహా మేరకు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ సనత్ నగర్ లో కాపురం పెట్టారు. ఇక్కడికి వచ్చాక కూడా గొడవలు జరుగుతుండటంతో నిందితుడు భార్య ఊర్మిళను ఇనుప రాడ్ తో బలంగా కొట్టి… కొడుకు కిషన్ ని నీళ్ల బకెట్ లో ముంచి అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కై ఆసుపత్రికి తరలించారు. రాజేష్ మీద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad