Home Latest News హ‌రీశ్‌రావు ఎనిమిదేళ్ల క‌ల నెర‌వేరిన వేళ‌..!

హ‌రీశ్‌రావు ఎనిమిదేళ్ల క‌ల నెర‌వేరిన వేళ‌..!

ఇటీవ‌ల తెలంగాణ వ్యాప్తంగా నిర్వ‌హించిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ల‌క్ష‌కు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఎనిమిదేళ్ల క‌ల నెర‌వేరింది. కాగా, సిద్దిపేట‌లో కేంద్రీయ విశ్వ విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే త‌న చిర‌కాల స్వ‌ప్న‌మ‌ని హ‌రీశ్‌రావు ప్ర‌తి మీడియా స‌మావేశంలో చెబుతుండ‌టం తెలిసిందే.

త‌న ఎనిమిదేళ్ల‌నాటి చిర‌కాల స్వప్న‌మైన‌ కేంద్రీయ విశ్వ విద్యాల‌యం బుధ‌వారంతో పూర్తి స్థాయిలో నిర్మిత‌మైంది. దీంతో మంత్రి హ‌రీశ్‌రావు కేంద్రీయ విశ్వ విద్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయం ప్రారంభం కావడం తో తన చిరకాల స్వప్నమ‌ని, నేటితో త‌న క‌ల‌ నెరవేరిందని అన్నారు.

ఈ విశ్వ విద్యాల‌యం కోసం ఎనిమిదేళ్లుగా కేంద్రంతో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులకు చక్కని విద్యా బోధన చేయాల‌ని, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితోనే సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని తేగలిగామ‌న్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వసతులతో కేవీ ప్రారంభం అయింద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad