Home Latest News కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ఊసేది ? : గల్లా జయదేవ్‌ ఫైర్

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ఊసేది ? : గల్లా జయదేవ్‌ ఫైర్

బడ్జెట్‌లో APకి ఇచ్చిన హామీల ఊసేది ?, ఈ బడ్జెట్‌ లో కూడా ఆంద్ర రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదంటూ ఆంద్రప్రదేశ్ MP గల్లా జయదేవ్‌ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. APకిచ్చిన హామీలు, నెరవేర్చిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌ సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గల్లా మాట్లాడుతూ BJP ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నోట్ల రద్దు, GST వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందని.. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కచ్చితత్వం, జవాబుదారీతనం లోపించిందని ఎద్దేవాచేశారు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 29 అంశాల్లో రాష్ట్రనికి న్యాయం జరగలేదని.. డిల్లీని మించిన రాజధాని కడతామని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోదీ చెప్పారని.. తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను కూడా విస్మరించారని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించారు గల్లా.

మరీ ముఖ్యంగా రైతులను ఆదుకుంటామంటూ చెప్పి రోజుకు రూ.17 ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని.. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఈ నాలుగేళ్లలో APలో CM చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆదాయం రెట్టింపు చేశారు అని గుర్తు చేశాడు. అలాగే 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. GST, నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని.. మీ 5ఏళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకె చివరిదైనా ఈ బడ్జెట్‌లో రైతులకు ఏవో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad