కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగిన కావూరి శాంబశివరావు యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ విభజనతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అయితే, బీజేపీలో తొలి నుంచి కూడా కావూరి శాంబశివరావు యాక్టివ్ రోల్ ను ప్లే చేయలేదు. అదే సమయంలో సీనియర్ నేతగా తన ఉనికిని చాటుకుంటూ పెద్దగా కనిపించని కావూరి తన రాకీకీయ భవిష్యత్తుకు సంబంధించి సీరియస్‌గా ఆలోచన చేస్తున్నారట.
ఏపీలో టీడీపీతో పొత్తు చెడిన తరువాత బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే తన పొలిటికల్ ఫ్యూచర్ శూన్యంతో నిండటం మినహా ఏం మిగులుతుందని కావూరి భావిస్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట. పార్టీ మారే దిశగా ఆలోచన చేస్తున్నారని, అతి త్వరలోనే జంప్ ఖాయమని ఒక వైపు సీరియస్‌గా డిస్కర్షన్స్ సాగుతుంటే దీనిపై వివరణ ఇవ్వడానికి మాత్రం ఇటు పార్టీ వర్గాలకు, అటు పొలిటికల్ సర్కిల్స్‌కు కావూరి శాంబశివరావు అందుబాటులో లేరట. ఆయన మొబైల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటూ మరింత చర్చకు తెర తీస్తుందట.