Home Latest News కొనసాగుతున్న F2 ప్రభంజనం.. 25 రోజుల్లోనే సరికొత్త రికార్డ్

కొనసాగుతున్న F2 ప్రభంజనం.. 25 రోజుల్లోనే సరికొత్త రికార్డ్

టాలీవుడ్ యంగ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ “ఎఫ్ 2” భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ ల నటనతో పాటు తమన్నా, మెహిరీన్ ల గ్లామర్ షో కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైనా ఈ సినిమా తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకొని జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. ఈ సినిమా విడుదలై నిన్నటితో 25 రోజులను పూర్తి చేసుకుంది.

ఇప్పటికే 100 కోట్లకి పైగా గ్రాస్ ను, 75 కోట్లకి పైగా షేర్ ను సాదించిన F2, కృష్ణా జిల్లాలో అత్యధిక షేర్ ను రాబట్టిన సినిమాల్లో 6వ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డ్ సృస్టించింది. దీనికంటే ముందు మొదటి అయిదు స్థానాల్లో బాహుబలి 2, రంగస్థలం, బాహుబలి, భరత్ అనే నేను, ఖైదీ నెంబర్ 150 లు ఉన్నాయి. 25 రోజుల్లో ఈ సినిమా 5 కోట్ల షేర్ ను సాధించి కృష్ణా జిల్లాలో 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ విదంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 2’ మరో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad