ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మహర్షి . ఈ సినిమాలో మహేష్ జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. కీలకమైన పాత్రలో నరేష్ నటిస్తున్నారు. దాదాపుగా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భరత్ అనే నేను సినిమా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంతకంతకు అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది.
తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా మరో గుడ్ న్యూస్ అందచేశారు. ఈ నెల 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు మరో పాట ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘ఎవరెస్ట్ అంచున .. ‘ అంటూ కొనసాగే వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు.. మహేష్ స్టైలిష్ గా నిలుచుని ఉన్న జిఫ్ ను జోడించి ట్వీట్ చేశారు. ‘1 నేనొక్కడినే’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, సినిమాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ మరోసారి మహేష్ కి మ్యూజికల్ హిట్ అందించుటకు సిద్ధమయ్యారు.
#EverestAnchuna… Song Video Preview on the 19th of April at 04:05 p.m. #Maharshi #ssmb25
Superstar @urstrulyMahesh @hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1@ShreeLyricist pic.twitter.com/9ZuQ4ek0kp— Vamshi Paidipally (@directorvamshi) April 17, 2019