Home General అద‌ర చుంబ‌నం కోసం ఆశ‌ప‌డి.. చిత‌క్కొట్టించుకున్నావా బుజ్జా..!

అద‌ర చుంబ‌నం కోసం ఆశ‌ప‌డి.. చిత‌క్కొట్టించుకున్నావా బుజ్జా..!

బుగ్గ‌పై ముద్దు కావాలా..? లేక లిప్ లాక్ కావాలా..? తేల్చుకో అంటూ ప్రేమికుల రోజున ముద్దు అడిగిన ప్రేమికుడికి రెండు ఆప్ష‌న్‌లు ఇచ్చింది ఓ ప్రేమికురాలు. గ‌డ‌ప‌వ‌ర‌కు వ‌చ్చిన అదృష్టానికి త‌లుపులు తీయ‌కుండా ఉండేందుకు అత‌నేమైనా అమాయ‌కుడా.. అస‌లే ప్రేమికుడు. వెంట‌నే ఆప్ష‌న్ బీని ఎంచుకున్నాడు. అదేనండీ.. లిప్‌లాక్‌.

మ‌న గురుడు అలా బీ ఆప్ష‌న్‌ను ఎంచుకున్నాడో.. లేదో.. కండీషన్స్ అప్లై అంటూ ప్రేయ‌సి నోట నుంచి వ‌చ్చిన మాట విన‌ప‌డింది. వ‌చ్చిన ఛాన్స్‌ను అస్స‌లు మిస్ కాకూడ‌ద‌ని భావించిన గురుడు కండీష‌న్స్‌కు నిలువుగా త‌లూపాడు. అలా త‌న త‌ల‌ను నిలువుగా ఊప‌డ‌మే ప్రాణాల‌మీద‌కు తీసుకొస్తుంద‌ని ఊహించ‌లేక‌పోయాడు. చివ‌ర‌కు త‌న జీవితంలో ఎప్పుడూ చూడ‌ని జైలును చూశాడు. ఇంత‌కీ ఆ ప్రియురాలు ఏం చెప్పింది..? ప్రియుడు జైలుకెళ్లాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింది..? అస‌లు సంఘ‌ట‌న ఎక్క‌డ చోటు చేసుకుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

అద‌ర చుంబ‌నం కోసం ఆశ‌ప‌డి భంగ‌ప‌డ్డ ప్రేమికుడికి సంబంధించిన ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై ప‌రిధిలో చోటు చేసుకుంది. ప‌ట్టాభిరామ్ తండురై గ్రామానికి చెందిన శ‌క్తివేల్ అనే 22 ఏళ్ల కుర్రాడు రెండు నెల‌ల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ ట్ర‌స్ట్ త‌రుపున నిర్వ‌హించిన ఉద్యోగ మేళాలో శిక్ష‌ణ‌కు ఎంపిక‌య్యాడు. ఉద్యోగ శిక్ష‌ణ‌లో భాగంగా చెన్నైకు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలోనే త‌న బ్యాచ్‌లోని ఓ యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా చిగురించింది. ఆ వెంట‌నే ఫిబ్ర‌వ‌రి 14 రావ‌డం కూడా మ‌నోడికి బాగానే క‌లిసొచ్చింది. ఆ తేదీని ఎలా వాడాలో అని ఆలోచించిన గురుడు ప్రేయ‌సిని ముద్దు అడిగాడు. ప్రియుడి కోరిక‌ను కాద‌న‌లేక గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అందుకు
స్పాట్‌ను ఫిక్స్ చేయ‌డంతోపాటు కండీష‌న్స్ కూడా పెట్టింది

బాగా గుర్తు పెట్టుకో అంటూ కండీష‌న్స్ చెప్ప‌డం మొద‌లు పెట్టిన ప్రేయ‌సి.. చెన్నైలోని రాయ‌పేట నుంచి మెరీనా బీచ్ వ‌ర‌కు బుర‌ఖాలో వ‌స్తే నీకు లిప్‌లాక్ క‌న్ఫాం అంటూ తేల్చేసింది. ఓస్‌.. అంతేగా.. నేనింకా ఏదో సాహ‌సం చేయ‌మంటావేమోన‌ని భ‌య‌ప‌డ్డా అనేలా మ‌నోడు ఫేస్ ఫీలింగ్ పెట్టాడు. ప్రేయ‌సి చెప్పిన‌ట్టే ప్రేమికుల రోజున బుర‌ఖా ధ‌రించి ప్రేయ‌సితో క‌లిసి రాయ‌పేట నుంచి మెరీనా బీచ్‌వైపు న‌డ‌క ప్రారంభించాడు. ఊహ‌ల్లో తేలుతూ బుర‌ఖా వేసుకుని న‌డుస్తున్న శ‌క్తివేల్ ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా ఊహించాలా..? తెలిసిందే క‌దా..!

శ‌క్తివేల్ ఊహాలోకంలో తేలుతూ బుర‌ఖాలో న‌డుస్తుంటే.. ఆయ‌న ప‌క్క‌నే న‌డుస్తున్న స్థానికుల చూపులు మాత్రం అనుమానాస్ప‌దంగా ఆయ‌న‌వైపు తిరిగాయి. పైన బుర‌ఖా ఓకే.. కానీ కింద షూ, న‌డ‌క స్టైల్‌పై అనుమానం వ‌చ్చింది. ఇంకేముంది స్థానికులంతా దూకుడు సినిమాలో విల‌న్లు మ‌హేశ్ బాబును రౌండ‌ప్ చేసిన‌ట్లు శ‌క్తివేల్‌ను రౌండ‌ప్ చేశారు. బుర‌ఖా వేసుకుని ఎందుకు తిరుగుతున్నావ‌ని అడిగిన దానికి శ‌క్తివేల్ స‌మాధానం చెప్ప‌క ముందే చిత‌క్కొట్ట‌డం స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుత సొసైటీ అంతేగా మ‌రీ..!

బీచ్‌లో ప‌హారాకాస్తున్న పోలీసులు విష‌యం తెలుసుకుని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి శ‌క్తివేల్‌ను అదుపులోకి తీసుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్థానికులు కొట్టిన దెబ్బ‌లు అటువంటివి మ‌రీ..! వైద్యుల చికిత్స అనంత‌రం శ‌క్తివేల్‌ను నేరుగా పోలీసు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. స్థానికుల రియాక్ష‌న్‌తో బీచ్‌లో మాయ‌మైన ఆ ప్రేయ‌సి.. పోలీసు స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. త‌మ మ‌ధ్య జ‌రిగిన పిబ్ర‌వ‌రి 14 బెట్టింగ్ విష‌యాన్ని బ‌య‌టెట్టి త‌న ప్రియుడు శ‌క్తివేల్‌ను విడిపించుకుంది. ముద్దు కోసం ఆశ‌ప‌డితే.. ప‌ర్యావ‌సానం ఎలా ఉంటుందో మ‌నోడికి తెలిసొచ్చిన‌ట్టుంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి మీ కామెంటో..!!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad