ఓ వైపు సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా మరో వైపు శాసన మండలి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలోను ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ కోటాలో 17 మంది పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాకలు గాను 16 మంది బరిలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయి.
మరో వైపు ఏపీలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులకు కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో 5,62,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.