Home Latest News ఎలక్ష‌న్స్ 2019 : జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.10వేలు చొప్పున డిపాజిట్‌..!

ఎలక్ష‌న్స్ 2019 : జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.10వేలు చొప్పున డిపాజిట్‌..!

జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.10వేలు వేస్తున్నారంటూ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. మొరాబాద్ జిల్లాలోని ఓ బ్యాంక్ అకౌంట్ల‌లోకి సుమారు 17 వేల అకౌంట్‌ల‌లో రూ.10వేలు చొప్పున న‌గ‌దు డిపాజిట్ అయింది. ఇది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇలా మొత్తం 1.7 కోట్ల జ‌మ అయ్యాయి.

అయితే, కేంద్ర ప్ర‌భుత్వమే దేశంలోని అంద‌రి బ్యాంక్ అకౌంట్‌ల‌లో డ‌బ్బులు వేస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. కానీ, బీజేపీ దీనిపై ఎటుంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో ఇది నోటుకు ఓటు వ్య‌వ‌హార‌మేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

మ‌రోవైపు ప్రియాంక గాంధీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విస్తృత ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న్యాయ్ కింద ప్ర‌తి ఒక్క‌రి ఖాతాల్లో రూ.6వేలు వేస్తామ‌ని ప్ర‌చారం సాగిస్తున్నారు. అంత‌లోనే రూ.10వేలు ప‌లువురి జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో జ‌మ అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ అంశంపై రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంది.

ఇది బీజేపీ ప‌నేన‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తుండ‌గా, బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వ్య‌వ‌హారంతో త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన నిఘా, ఐటీ వ‌ర్గాలు బ్యాంక్ ప్ర‌తినిధులే ఈ న‌గ‌దును డిపాజిట్ చేశార‌ని ప్రాధ‌మిక ద‌ర్యాప్తులో తేల్చారు. జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో డ‌బ్బు డిపాజిట్‌పై అలెర్ట్ అయిన ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల బ్యాంకు ఖాతాల‌పై ఫోక‌స్ పెట్టింది. అస‌లేం జ‌రుగుతుంద‌న్న విషయాల‌పై ఆరా తీస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad