దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ క్రమంలోనే నిధులను మంజూరు చేయడంతోపాటు పథకాలను అమలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, మంజూరు చేస్తున్న నిధులను కొన్ని రాష్ట్రాలు వారి ఖాతాలో వేసుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం పేరు వినపడకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.
మోడీ ప్రజారంజక పాలనతో తమ రాజకీయ ఉనికి కష్టమని భావించిన కొన్ని అవినీతి పార్టీలు మూకుమ్మడిగా చేరి బీజేపీకి వ్యరేకంగా ఒక్కటవుతున్నాయన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ పుల్వామా వద్ద జవాన్లపై జరిగిన మానవబాంబు పేలుళ్ల గురించిపురందేశ్వరి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. దాడిచేసిన, దాని వెనకున్న ప్రతీ ఒక్కరిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు.