Home Latest News టీడీపీ ఎమ్మెల్యే అనిత‌కు కోర్టు స‌మ‌న్లు..!

టీడీపీ ఎమ్మెల్యే అనిత‌కు కోర్టు స‌మ‌న్లు..!

ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు విశాఖ కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. కాగా, కాంట్రాక్ట‌ర్ శ్రీ‌నివాసరావు అనే వ్య‌క్తి త‌న‌కు ఇచ్చిన బ్యాంకు చెక్ బౌన్స్ అయింద‌ని, ఆమె నుంచి రావాల్సిన న‌గ‌దును త‌న‌కు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్ర‌యించ‌డంతో అనిత‌కు న్యాయ‌మూర్తి స‌మ‌న్లు జారీ చేశారు.

కాంట్రాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు తెలిపిన వివ‌రాల మేర‌కు అక్టోబ‌ర్ 2015లో ఎమ్మెల్యే అనిత త‌న వ‌ద్ద రూ.70 ల‌క్ష‌ల న‌గ‌దును అప్పుగా తీసుకుంద‌ని, ఆ మేర‌కు ప్రామిస‌రీ నోటును రాసివ్వ‌డంతోపాటు పోస్ట్ డేటెడ్ వేసి చెక్కు కూడా రాసిచ్చింద‌న్నారు. అదే స‌మ‌యంలో ఆ చెక్కును అప్పుడే బ్యాంకులో వేయొద్ద‌ని, త‌న‌కు న‌గ‌దు అవ‌స‌రాలు ఉన్నాయ‌ని, మ‌రికొంత కాలం ఆగాల‌ని కోర‌డంతో వేచి చూసిన‌ట్లు శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

కొంత‌కాలం ఆగాక‌, ఎమ్మెల్యే అనిత ముందు ఇచ్చిన చెక్‌ను ర‌ద్దు చేసి, హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన న‌గ‌దు చెక్కును ఇచ్చింద‌ని, త‌న‌కు ఇచ్చిన రూ.70 ల‌క్ష‌ల చెక్కును మార్చుకుందామ‌ని బ్యాంకుకు వెళ్తే చెక్కు చెల్ల‌దంటూ బ్యాంకు అధికారులు తెలిపార‌ని శ్రీ‌నివాస‌రావు మీడియాకు వెల్ల‌డించారు.

దీంతో ఎమ్మెల్యే అనిత ఇచ్చిన చెక్కు ర‌ద్దైంద‌ని, చ‌ట్ట ప్ర‌కారం అనిత నుంచి త‌న‌కు చెల్లించాల్సిన రూ.70 ల‌క్ష‌ల‌ను వెంట‌నే చెల్లించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ విశాఖ కోర్టును ఆశ్ర‌యించార‌న్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే అనిత‌కు కోర్టు జ‌డ్జీ స‌మ‌న్లు జారీ చేశార‌ని, ఈ నెల 26న కోర్టుకు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో జ‌డ్జీ పేర్కొన్నార‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad