Home Latest News కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధికి తీవ్ర గాయాలు..!

కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధికి తీవ్ర గాయాలు..!

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధి ర‌మేశ్ రాథోడ్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కాగా, ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌డంతో ఉట్నూరు నుంచి ఆదిలాబాద్‌కు కారులో బ‌య‌ల్దేరిన ర‌మేశ్ రాథోడ్ మావ‌ల బైపాస్ రోడ్డు వ‌ద్ద ప్ర‌మాదానికి గుర‌య్యారు. అయితే అడ‌వి జంతువులు రోడ్డుకు అడ్డంగా రావ‌డంతో వాటిని త‌ప్పించ‌బోయిన ర‌మేశ్ రాథోడ్ కారు ప‌క్క‌నే ఉన్న ఓ చెట్టును ఢీకొంద‌ని స్థానికులు తెలిపారు.

ఈ ప్ర‌మాదంలో ర‌మేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. కారులో అప‌స్మార‌క స్థితిలో ఉన్న ర‌మేశ్ రాథోడ్‌ను గ‌మ‌నించిన స్థానికులు అక్క‌డ్నుంచి చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ర‌మేశ్ రాథోడ్ ఛాతికి, త‌ల‌కు తీవ్ర గాయాలైన‌ట్టు వైద్యులు తెలిపారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ర‌మేశ్ రాథోడ్‌ను ప‌రామ‌ర్శించేందుకు కాంగ్రెస్ శ్రేణులు రిమ్స్ ఆస్ప‌త్రికి క్యూ క‌ట్టారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad