ఏపీ పోలీసులకు ఇటీవల ప్రకటించినట్టుగానే తెలంగాణ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వబోతున్నారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే అమలుకు జిల్లా ఎస్పీల మొగ్గు చూపారు. దీంతో డీజీ కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు నోచుకుంది.
డ్యూటీ రోస్టర్ చార్ట్ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు ప్లాన్ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలను ఆదేశించింది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
కరీంనగర్‌లాంటి కొన్ని జిల్లాల్లో అమలు చేశారు. తరువాత అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కూడా వీక్లీ ఆఫ్ ప్రస్తావన వచ్చినా.. అమలు చేసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.