Home Latest News ఆ జిల్లాలో క్లీన్ స్వీప్‌కు సీఎం చంద్ర‌బాబు ప్లాన్‌..! జ‌గ‌న్ రంగంలోకి దిగుతారా..?

ఆ జిల్లాలో క్లీన్ స్వీప్‌కు సీఎం చంద్ర‌బాబు ప్లాన్‌..! జ‌గ‌న్ రంగంలోకి దిగుతారా..?

ఏపీ ఎన్నిక‌ల సంగ్రామం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ కేంద్రంగా సాగుతోంది. నువ్వా.. నేనా అన్న‌ట్టుగా ఇప్ప‌టికే రెండు పార్టీలు త‌ల‌ప‌డుతున్నాయి. ఇంకా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాలేద‌న్న మాటే కానీ ఎన్నిక‌ల వార్ మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ర‌క ర‌కాల కోణాల్లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ వ్యూహాల‌ను ర‌చిస్తోంది. అందులో ఒక‌టి క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు టెన్ష‌న్ క్రియేట్ చేయ‌డ‌మేన‌ట‌.

అయితే, వైసీపీ అత్యంత బ‌లంగా ఉన్న జిల్లాల్లో క‌డ‌పది ప్ర‌థ‌మ స్థానం అన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ బ‌లం పెంచుకోవ‌డం, అధిక సీట్లు గెలుచుకోవ‌డం మీద ఫోక‌స్ పెడితే జ‌గ‌న్‌కు టెన్ష‌న్ క్రియేట్ చేయాల‌న్న వ్యూహం కూడా అమ‌లు చేసిన‌ట్ట‌వుతుంద‌న్న‌ది టీడీపీ ఉద్దేశ‌మ‌ట‌.

ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లాలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ప్ర‌క్రియ‌కు చంద్ర‌బాబు తెరతీశార‌ట. అందులో భాగంగానే క‌డ‌ప జిల్లాలోని మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను, ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ది అసెంబ్లీ స్థానాల‌కు గాను తొమ్మిది స్థానాల‌ను వైసీపీ గెలుపొంద‌గా.. కేవ‌లం ఒక్క రాజంపేట‌లో మాత్ర‌మే టీడీపీ విజ‌యం సాధించింది.

రాజంపేట నుంచి 2014 ఎన్నిక‌లోల టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి విజ‌యం సాధించారు. ఇప్పుడు మేడా కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అదే స‌మ‌యంలో బ‌ద్వేల్‌లో వైసీపీ నుంచి గెలిచిన జ‌య‌రాములు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ నుంచి గెలిచిన ఆది నారాయ‌ణ‌రెడ్డి టీడీపీలోకి జంప్ చేశారు. ఈ సారి మొత్తం ప‌దికి ప‌ది కొట్టాల‌న్న ల‌క్ష్యంగా జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెడుతున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు వేళ ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. ఇలా వైసీపీకి కంచుకోట‌లాంటి జిల్లా అలాగే వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో మ‌రింత టెన్ష‌న్ పెంచితే.. జ‌గన్ దృష్టంతా క‌డ‌ప‌పై మ‌ర‌లుతుంద‌ని, ఆ అంశాన్ని మ‌రిన్ని కోణాల్లో వాడుకోవ‌చ్చన్న‌ది టీడీపీ ఎత్తుగ‌డగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad