ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంకు మరో ఎంపీ గుడ్‌బై చెప్పనున్నారా..? అంటే సోషల్ మీడియా కథనాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కాగా, ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లాలో టీడీపీ గెలుపొందిన ఒక్కగానొక్క రాజంపేట ఎమ్మెల్యే మొదలు పెట్టిన వైసీపీలోకి వలసల పర్వాన్ని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, భీమిలి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఆళ్లగడ్డ టీడీపీ నేతలు కొనసాగించారు.
తాజాగా, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు టీడీపీని వీడేందుకు సిద్ధమైపోయారంటూ ప్రముఖ ఛానెళ్లతోపాటు, సోషల్ మీడియా విరివిగా ప్రచారం చేస్తున్నాయి. ఎంపీ రవీంద్ర బాబు టీడీపీని వీడేందుకు గల కారణాలను వెల్లడిస్తూ… వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్‌ను ఎంపీ రవీంద్రబాబుకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం అంత సుముఖంగా లేదని, కనీసం ఎమ్మెల్యే సీటుపై కూడా స్పష్టత ఇవ్వలేదని, దీంతో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సోషల్ మీడియా పేర్కొంటున్నాయి.