Home Latest News ఎమ్మెల్యే టికెట్ కోసం ఏపీ కాంగ్రెస్‌కు చిరంజీవి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారా..?

ఎమ్మెల్యే టికెట్ కోసం ఏపీ కాంగ్రెస్‌కు చిరంజీవి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారా..?

ప్ర‌త్యేక హోదా కేంద్రంగా ఏపీ కాంగ్రెస్ మ‌రో స‌మ‌రానికి సై అనేసింది. ప్రత్యేక హోదా భ‌రోసా ప్ర‌జా యాత్రను అనంత‌ప‌నురం నుంచి మొద‌లుపెట్టింది. ఈ యాత్ర‌లో రాహుల్‌గాంధీతోపాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన‌బోతున్నారు. ఈ యాత్ర ప్రారంభంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేత‌లంతా పాల్గొంటే మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మాత్రం అడ్ర‌స్ లేరు. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఈ అంశంపైనే సీరియ‌స్ చ‌ర్చ జ‌రుగుతోంది.

అలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీలో ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగాకానీ పోటీచేస్తాన‌ని ద‌ర‌ఖాస్తు పెట్ఉకోలేద‌ట‌. అయితే చిరంజీవి గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవిని స్టార్ క్యాంపెయిన‌ర్ల లిస్టులో చేర్చినా.. ఆయ‌న మాత్రం పార్టీ త‌రుపున కాంగ్రెస్ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ఎక్క‌డా ప్రచారం చేయ‌లేదు.

చివ‌రికి కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో కూడా చిరంజీవి క‌న్నెత్తికూడా చూడ‌లేదు. దీంతో చిరంజీవి జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ నాడే జోరుగా తెలుగు రాష్ట్రాల్లో సాగింది. ఇప్పుడు ఏపీలో టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌కుండా కాంగ్రెస్‌కు తాను దూర‌మయ్యాయ‌ని, స్ప‌ష్టంగా చెప్పేశాడ‌న్న‌ది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

అయితే, మెగాస్టార్ విష‌యంలో మాత్రం ఏపీపీసీసీ ఆశాభావంగా చూస్తోంద‌ట‌. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారం చేయ‌ని చిరంజీవి.. ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీచేసే అవ‌కాశ‌మే లేద‌ని రాజ‌కీయవ‌ర్గాలు అంటున్నాయి. మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ సారి పోటీ చేసేందుకు ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటూ వెల్లువ‌లా వ‌చ్చిప‌డ్డ ద‌ర‌ఖాస్తులు ఇచ్చిన ఆనందం నల్లారి, మెగాస్టార్ వ్య‌వ‌హారశైలి ఆవిరి చేసింద‌న్న గుస‌గుస‌లు ఏపీ కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad