Home Latest News మోడీని దించేదాక చంద్రబాబు నిద్రపోడు..!

మోడీని దించేదాక చంద్రబాబు నిద్రపోడు..!

అభివృద్దికి అడ్డుపడితే జనం తరిమితరిమి కొడ తారని, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో జరిగే అభివృద్ది పనులకు అడ్డు పడుతున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ది, ఐటిశాఖమంత్రి నారాలోకేష్‌ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన ఆంశాల పై ఆయన మాట్లాడలేకపోతున్నారని. మోడీ గురించి మాట్లాడితే స్పీడుగా జైలుకు వెళతారన్న భయం ఆయనలో వుందని, జగన్‌ ఓ దొంగపుత్రుడని, పవన్‌ కల్యాణ్‌ మాటలకే పరి మితమని తీవ్రస్థాయిలో ఆయన అన్నారు.

రాష్ట్రానికి మోడీ మోసం చేశారని రాష్ట్రా భివృద్ది చూసి ఓర్వలేక రాష్ట్రానికి రావాల్సిన విభజన ఒప్పందాలను కూడా అమలు చేయలేదని మోదీని దింపేవరకు చంద్రబాబు పడుకోడని ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. కడపజిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో జరిగిన జన్మ భూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రిలోకేష్‌ మాట్లాడారు.

రాష్ట్రం విభజించి నప్పుడు 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌ వుండేదని అయినా కూడా ముఖ్యమంత్రి చంద్ర బాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. విలీన ఒప ్పందంలోని కడప ఉక్కును కూడా అమలు చేయలేదని దీంతో రాష్ట్రప్రభుత్వమే ముందుకు వచ్చి ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేస్తోందని చెప్పారు. అయితే ఈ జిల్లాకే చెందిన ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డి ఉక్కుపరిశ్రమ గురించి ఏ రోజైనా మోదీని అడిగారా అని ప్రశ్నించారు.

ఉక్కు ఇవ్వాల్సింది కేంద్రమేనని అయినా ప్రతిపక్షనేత గానీ, రాజ్యసభలో వున్న వారి ఎంపీలుగానీ ఉక్కు పరిశ్రమ గురించి విభజన ఒప్పందాల గురించి మాట్లాడే సాహాసం చేయలేదని అన్నారు. జగన్మోహన్‌రెడ్డికి మోదీని ప్రశ్నించి దమ్ము దైర్యం లేదని ఆయన ఒక డ్రామాను చేస్తున్నారని విమర్శించారు. మొదట్లో ఎంపీల రాజీనామా డ్రామాలు వేశారని అది ప్రజల్లో ప్లాప్‌ కావడంతో కోడికత్తి డ్రామా ఆడారని అన్నారు.

ఆవు, అంబులెన్స్‌ డ్రామా కూడా..! 

 అంతేకాదు ఆవు, అంబులెన్స్‌ డ్రామా కూడా ఆడారని పేర్కొన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఆవు అడ్డమొస్తే ఇది చంద్రబాబు పంపారా అని ఆవును అడగడం ఆశ్చర్యంగా వుందని మాట్లాడారు. మరోచోట 108 సక్రమంగా పనిచేయలేదని మాట్లాడుతుండగా అదే దారిలో 108 వాహనం రావడంతో ఆ డ్రైవర్‌ను నిన్ను చంద్రబాబు పంపారా అని అడిగారాని ఇలా డ్రామా కంపెనీ నడుపుతు న్నారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడ్డారని అయినా చంద్రబాబునాయుడు వాటిని పూర్తిచేసి ఆయ నను గెలిపించిన జిల్లాలోని ఆయన సొంత నియో జకవర్గం పులివెందులకే నీళ్ళు ఇవ్వడం జరిగిందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు నాలుగునెలల్లో రానున్నాయని ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం కులమతాలకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. 68 ఏళ్ళ వయసులో కూడా 24 ఏళ్ళ యువకుడిలా మనకోసం పనిచేస్తున్న చంద్రబాబును మళ్ళీ గెలిపించాలని కోరారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోవున్నా ఇప్పటికే 15 వేల కోట్ల రుణమాఫీ చేశామని త్వరలో మరో 8 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపారు.

మోడీని దించేదాక చంద్రబాబు నిద్రపోడు..!

ఆంధ్ర అభివృద్ది చూసి మోదీ అసూయ పడు తున్నారని రాష్ట్రానికి ఇచ్చిన 18 హామీల్లో ఒక్కటి
కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రత్యేకహోదా ఇస్తా మంటూ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మోసం చేశారని చివరి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేయ డంతో ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఫోన్‌ చేసినా ఎత్తలేదని పేర్కొన్నారు. దీంతో కేంద్రమంత్రులతో రాజీనామా చేయించడం జరిగిందన్నారు. చివరకు ఉక్కుపరిశ్రమ కోసం సీఎం రమేష్‌దీక్ష చేస్తే కూడా పట్టించుకోకపోవడంతో రాష్ట్రప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.

ఉక్కు పరిశ్రమే కాదు ఏ రకంగా చూసినా మోదీ చేస్తున్న ఈ రాష్ట్ర ంలో ప్రతిపక్షనేత మోడీ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌ మోదీ గురించి మాట్లాడితే మళ్లిdజైలుకు వెళ్ళాలనే భయం పట్టుకుందన్నారు. మంత్రి లోకేష్‌ మోదీ, జగన్‌, పవన్‌లపై విమర్శలు చేస్తూ రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాప నలు, భూమిపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, టీడీ పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాయచోటి ఇన్‌చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి, ఆ నియోజకవర్గ నేత సుగవాసి పాలకొండ్రాయుడు, కలెక్టర్‌ హరికిరణ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad