ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు దిక్కు తోచడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వారందర్నీ వైసీపీలో చేరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇంకా ఒకరిద్దరు టీడీపీ నుంచి వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇక ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ స్వార్ధం కోసం ఏం చేయడానికైనా ప్రధాని మోడీ వెనకాడరని, ఆ క్రమంలోనే సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన వైసీపీ బీసీ గర్జన సభకు సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి జనసమీకరణ చేశారని, కేసీఆర్ సాయంతో వైఎస్ జగన్ టీడీపీ నేతలను వైసీపీలోకి లాగే ప్రయత్ని చేస్తున్నారన్నారని చంద్రబాబు విమర్శించారు.