Home Latest News వైఎస్ జ‌గ‌న్ మెడ‌పై సీబీఐ క‌త్తి : సీఎం చంద్ర‌బాబు నాయుడు

వైఎస్ జ‌గ‌న్ మెడ‌పై సీబీఐ క‌త్తి : సీఎం చంద్ర‌బాబు నాయుడు

ఎటువంటి పాల‌నా ప‌ర‌మైన విధానాల రూప‌క‌ల్ప‌న‌ లేకుండా రాష్ట్రాన్ని విభ‌జిస్తే, నూత‌నంగా ఏర్ప‌డ్డ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నాడు చెప్ప‌డంతోనే గ‌తంలో తాము కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని, కానీ న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న పెట్టి ఏపీ అభివృద్ధిని సైతం అడ్డుకున్నార‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు.

విజ‌య‌వాడ కేంద్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఇవాళ నిర్వ‌హించిన మ‌హిళ‌ల‌కు ఇళ్ల పట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందునే తాము కేంద్ర ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కొచ్చామ‌ని, ఆఖ‌రికి కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీల చేత కూడ రాజీనామాలు చేయించామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డిన త‌నను ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోలేక ప‌రోక్షంగా సీబీఐ, ఈడీ అంటూ కేసులు బ‌నాయిస్తుంద‌ని, టీడీపీ నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిపై కేసులు పెడుతూ భ‌యానక వాతావ‌ర‌ణం క‌ల్పిస్తుంన‌ద‌న్నారు. బీజేపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా భ‌య‌ప‌డేది లేద‌ని చంద్ర‌బాబు అన్నారు.

త‌మ‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి ఏపీకి ప్ర‌త్యేక రాకుండా చేయ‌డ‌మే మోడీ ల‌క్ష్య‌మన్నారు. వారు పెట్టే కేసుల‌కు భ‌య‌ప‌డేది ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డేన‌ని, ఎందుకంటే ఆయ‌న‌పై ఇంత‌కు మునుపు నుంచే సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయ‌ని, జ‌గ‌న్ మెడ‌పై సీబీఐ క‌త్తి ఉంద‌ని, అందుకే జ‌గ‌న్ బీజేపీ అంటే భ‌య‌ప‌డ‌తార‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad