Home Latest News బాబు పని అయిపోయింది : YCPకి 150 సీట్లు గ్యారెంటీ..! – బొత్స

బాబు పని అయిపోయింది : YCPకి 150 సీట్లు గ్యారెంటీ..! – బొత్స

YCP సీనియర్ నేత “బొత్స సత్యనారాయణ” AP ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు తన అసమర్థత, వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేస్తున్నారని ఆయన విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని గుర్తుచేసిన ఆయన… “చంద్రబాబుది నోరా.. తాటిమట్టా ?” అని ప్రశ్నించారు. ఓడిపోతున్నాం అనే భయంతో TDP నేతలు తమకున్న అవలక్షణాలను ఎదుటివారికి ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు బొత్స.

అలాగే “స్ట్రాంగ్ రూమ్” ల దగ్గర YCP ఫలితాలను తారుమారు చేస్తుందన్న చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో కూడా బొత్స స్పందించాడు.. “అమ్మో నన్ను అరెస్ట్ చేస్తారు. చుట్టూ వలయంలాగా ఉండి.. నన్ను కాపాడండి అని చంద్రబాబు ప్రజలను కోరారుగా… అలాగే ఇప్పుడు కూడా TDP నేతలు ఈవీఎం కేంద్రాల చుట్టూ వెళ్లి వలయంలాగా ఉండమనండి.. ఓడిపోయే ముందే ఇలాంటి మాటలు వస్తాయి… అంతగా కావాలంటే చంద్రబాబు స్వయంగా వెళ్లి “స్ట్రాంగ్ రూమ్” దగ్గర పడుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు.

APలో జరిగినవి ఎన్నికలే కావంట. మరి ఏవి ఎన్నికలు ? మొన్న నంద్యాలలో జరిగినవేనా అసలైన ఎన్నికలు..? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నువ్వు దేశ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు చంద్రబాబు.. ? అంటూ బొత్స నిలదీశారు. చివరగా చంద్రబాబు పని అయిపోయింది.. ఆరోజే చెప్పాను ఇప్పుడు చెబుతున్నా.. ఏపీలో 150 స్థానాల్లో YCP ఘనవిజయం సాధిస్తుందని బొత్స జోస్యం చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad