Home General ఐపీఎల్ 2019 : కోల్‌క‌తా ఘ‌న విజ‌యం..!

ఐపీఎల్ 2019 : కోల్‌క‌తా ఘ‌న విజ‌యం..!

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌పై ఐదు వికెట్‌ల తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు మూడు వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. 206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఐదు బాల్స్ మిగిలి ఉండ‌గానే విక్ట‌రీ సొంతం చేసుకుంది. ఆండ్రూ ర‌స్సెల్ 48 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో త‌మ జ‌ట్టుకు విక్ట‌రీని అందించాడు.

అంత‌కు ముందు ఓపెన‌ర్లు క్రిస్లిన్ 43, ఊత‌ప్ప 33, నితీష్ రానా 37, దినేష్ కార్తీక్ 19 ప‌రుగుల‌తో రాణించారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ భారీ స్కోరు చేసినా ర‌స్సెల్ ధాటికి ఓటమి నుంచి త‌ప్పించుకోలేక‌పోయారు. 13 బంతుల్లో ఏడు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో 48 ప‌రుగులు చేసి బౌండ‌రీల సునామీని సృష్టించాడు. బెంగ‌ళూరు విక్ట‌రీ ఖాయ‌మ‌న్న స‌మ‌యంలో ర‌స్సెల్ త‌న బ్యాటింగ్‌తో మ్యాచ్ గ‌తినే మార్చేశాడు. 19వ ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో కోల్‌క‌తా విక్ట‌రీని క‌న్ఫామ్ చేశాడు.

బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ నుంచి ఎలాంటి ఆట‌ను అభిమానులు కోరుకున్నారో అలాంటి ఆట‌నే ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో మొద‌టిసారి చూపించింది. ఈ సీజ‌న్‌లో పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయిన కోహ్లీ అద్భుత హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డెవిలియ‌ర్స్ త‌న అస‌లైన ఆట‌ను రుచి చూపించాడు. ఫ‌లితంగా మూడు వికెట్‌లు కోల్పోయి 205 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా ముందుంచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 84, డెవిలియ‌ర్స్ 63 ప‌రుగుల‌తో చెల‌రేగారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad