Home Latest News ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వెన్నుపోటు ... క్లారిటీ ఇచ్చిన అలీ..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వెన్నుపోటు … క్లారిటీ ఇచ్చిన అలీ..!

టాలీవుడ్ మెగ‌స్టార్ చిరంజీవి వేసిన బాట‌లో మీరు వ‌చ్చారు.. నా బాట నేనే వేసుకున్నాను.. నా బాట‌లో నేనే న‌డిచాను.. నాకు బ్యాక్ గ్రౌండ్ స‌పోర్టు లేదు.. పుట్టింది, పెరిగింది రాజ‌మండ్రిలో.. ఎలా బ‌త‌కాలి అని నేర్పించింది చెన్నై, ఆ చెన్నైనే నాకు ఉన్న‌త‌మైన‌ జీవితాన్ని ప్రసాదించింది.. మీరు సినీ ఇండ‌స్ట్రీకి రాక‌ముందే నేను మంచి పొజీష‌న్‌లో ఉన్నాను.. అటువంటి నాకు మీరు ఏ విధంగా సాయ‌ప‌డ్డారు..? నాకు సినిమాలు లేక ఖాళీగా ఉంటే పిలిచి సినిమాలు ఏమైనా ఇప్పించారా..? డ‌బ్బు సాయం ఏమ‌న్నా చేశారా..? అంటూ టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నాయ‌కుడు, న‌టుడ అలీ ప్ర‌శ్న‌లను సంధించారు.

కాగా, సోమ‌వారం రాజ‌మండ్రి జ‌న‌సేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన అలీ త‌న పార్టీని కాద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం త‌నను మ‌రింత బాధించింద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అలీపై ఉన్న గౌర‌వంతో వారి బంధువుకు జ‌న‌సేన నుంచి టికెట్ ఇస్తే అలీ మాత్రం త‌న‌కు హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేర‌డ‌మేంట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. అలీని కష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకున్నామ‌ని, మ‌రింత న‌మ్మాన‌ని అటువంటి వ్య‌క్తులే వెన్నుపోటు పొడిచాడ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను అలీ ఖండించారు. ఆ మేర‌కు ఓ వీడియో సందేశాన్ని సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలో అలీ మాట్లాడుతూ.. అంద‌రికి న‌మ‌స్కారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నసేన స‌భ‌లో మాట్లాడుతూ నాపై ఓ చిన్న కామెంట్ చేశారు. నేను పుట్టింది రాజ‌మండ్రి, పెరిగింది రాజ‌మండ్రి. పుట్టిన గ‌డ్డ‌కు ఏద‌న్నా చేస్తే బాగుంటుంద‌ని మా తండ్రి పేరుపై ఓ ట్ర‌స్టు పెట్టి కుల‌మ‌తాల‌కు అతీతంగా సేవ చేస్తున్నాను.

రాజ‌మండ్రి జ‌న‌సేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నా గురించి మాట్లాడాల‌న్న ఆలోచ‌న లేక‌పోయినా మీ చుట్టుప‌క్క‌ల ఉన్న వాల్లు మిమ్మ‌ల్ని గిల్లి ఉంటారు. ఆ విష‌యం నేను అర్ధం చేసుకోగ‌ల‌ను. ఎందుకంటే రాజ‌మండ్రి క‌దా..!. నాకు సంబంధించి నా జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రి వద్ద చేయి చాపిన దాఖ‌లాలు లేవు. ఇన్‌క్లూడ్ మీ వ‌ద్ద కూడా. మీరు పార్టీ పెట్టిన‌ప్పుడు ఖురాన్‌తోపాటు డేట్స్‌కూడా ఇచ్చా.

మీరు పార్టీ పెట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జ‌న‌సేన‌లో చేర‌మ‌ని మీరు న‌న్ను అడ‌గ‌లేదు. నేనూ చేర‌తాన‌ని చెప్ప‌లేదు. నేను ఏ పార్టీలో చేరాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా..? సొంత అభిప్రాయం తీసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా..? నా బంధువుకు జ‌న‌సేన నుంచి సీటు ఇచ్చాన‌ని చెబుతున్నారు.. సీటు ఇవ్వ‌మ‌ని నేను అడిగానా..? పోనీ, మీరేమ‌న్నా సీటు ఇస్తున్న‌ట్టు నాకు చెప్పారా..? అని ప‌వ‌న్‌పై అలీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad