వైఎస్ జగన్‌పై కోడికత్తి దాడి కేసులో విశాఖ మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో నిందితుడు శ్రీనివాసరావు తరుపున వేసిన బెయిల్ పిటిషన్‌ను లాయర్ అబ్దుల్ సలీమ్ ఉపసంహరించుకున్నారు.
హైకోర్టు ఈ కేసును ఎన్.ఐ.ఏకు అప్పగించడంతో బెయిల్ పిటిషన్‌ను అక్కడే దాఖలు చేయాలని న్యాయమూర్తి లాయర్ సలీమ్‌కు సూచించారు. దీంతో లాయర్ గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. న్యాయమూర్తి సూచన మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేస్తామని అబ్దుల్ సలీమ్ చెప్పారు.
మరోవైపు కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్.ఐ.ఏకు అప్పగించేందుకు వడివడిగా అడుగులుపడుతున్నట్లు సమాచారం. రికార్డు వర్క్‌ను పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా కేసుకు సంబంధించిన పత్రాలు, నిందితుడు శ్రీనివాసరావును ఎన్.ఐ.ఏ అధికారులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.