వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇకపై ప్రతిపక్షనేత కాదు.. ఆయన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలవాలని, ఈ ఏడాది ఏప్రిల్ 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత ఆ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోనుందని ఆ పార్టీ గల్లీ కార్యకర్త నుంచి నేతల వరకు అంతా ఇదే మాట అటున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటీవల పలు సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలే తమ ధైర్యానికి కారణమని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఏదేమైనా, వారు అంటున్నట్టే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ వైసీపీని స్థాపించిన సంగతి విధితమే. ఇప్పుడు ఆ పార్టీ తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుంది. వైసీపీ తన చరిత్రలో రెండోసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోనుంది.
వాస్తవ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటికన్నా.. నేడు ప్రజల మద్దతు 90 శాతం పెరిగిందని రాకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యవహార శైలేనని వారు చెబుతున్నారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించినా.. విచారణలో భాగంగా ఆ కేసులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కొన్నిటిని కొట్టేశారు. మరికొన్ని కేసులపై విచారణ కొనసాగుతోంది. వాటిని కూడా రేపో మాపో కోర్టు కొట్టేస్తుందని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.
మాటపై నిలబడే వ్యక్తిత్వం జగన్‌పై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేలా చేసిందని, జగన్ ఒక అంశంపై మాట్లాడే ముందు పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసిన తరువాతనే ప్రజలకు హామీ ఇస్తాని, ఆ ఇచ్చిన మాటపై నిలబడి అమలు చేసే వరకు వెనకడుగు వేయడని, ఆ విషయం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తేటతెల్లమైందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఇలా జగన్ తన వ్యక్తిత్వంతో రాజకీయం బలాన్ని మరింత పెంచుకున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.
ఓ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..? అన్న ప్రశ్నకు చలసాని శ్రీనివాస్ సమాధానం ఇస్తూ వందకు వంద శాతం వైఎస్ జగన్ అవుతారని చెప్పారు. జగనే ఎందుకు సీఎం అవుతారు..? అన్న మరో ప్రశ్నకు మాటతప్పని నైజం. ప్రజల క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లే తత్వం, ప్రత్యేక హోదా అంశంలో ఒకే మాటపై నిలబడ్డ వ్యక్తిత్వం. పాలనను రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో చూడటం జగన్ వ్యక్తిత్వానికి నిదర్శనమని, ఆ లక్షణాలే జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేశాయని, ప్రజలు కూడా జగన్నే సీఎంను చూడాలని కోరుకుంటున్నారంటూ చలసాని ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇలా జగన్ వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పొల్లుపోకుండా విశ్లేషించిన చలసాని శ్రీనివాస్ ఇంటర్వ్యూను వీక్షించిన సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చలసాని శ్రీనివాస్ జగన్‌పై ఇంతలా అభిమానం చూపుతున్నాడంటే జగన్‌ను సీఎంను చేయడానికి వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.
మరోపక్క కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఇప్పటికే యావత్ సినీ ఇండస్ట్రీ వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపు వైసీపీ తరుపున ప్రచార రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పలువురు సీనియర్ మాజీ రాజకీయ నేతలు సైతం జగన్‌కు జై కొట్టి వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో విడుదలవుతున్న సంస్థల సర్వే ఫలితాలు కూడా వైసీపీ విజయం సాధించడం తధ్యమని చెబుతున్నాయి.
ఈ క్రమంలో కాపుల సంక్షేమం కోసం నిత్యం ఉద్యమాలు చేసే ముద్రగడ పద్మనాభం జగన్‌కు మద్దతు తెలిపితే తన సామాజికవర్గం కోసం తాను చేసిన డిమాండ్లను సాధించుకునేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా జగన్‌పై అభిమానంతో చలసాని, హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఇద్దరూ జగన్‌కు జై కొట్టి వైసీపీ తరుపున ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.