ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరికొద్ది సేపట్లో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ జీవో వివాదంపై ఎన్నికల సంఘం అధికారుల ముందు ఠాకూర్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ ఐజీ చీఫ్ బాధ్యతల నుంచి వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినా ఆయన మాత్రం అధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్టుగా వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించినట్టుగా తెలుస్తుంది.
అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు గతంలో ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలా పనిచస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావుతోపాటు కడప ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదు చేసింది.